ఫోకస్

దేశవ్యాప్త సమస్యగా కేంద్రం పరిగణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దేశవ్యాప్త సమస్యగా పరిగణించి కేంద్ర ప్రభుత్వం పరిష్కారాలను అందించాల్సి వుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతిలో వచ్చిన మార్పుల నేపథ్యంలో వ్యవసాయంలోకూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకపక్క తీవ్ర వర్షాభావ పరిస్థితులు, మరోవైపు కరవు కాటకాలతో వ్యవసాయంలో పెనుమార్పులు వచ్చాయి. పర్యావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగం ప్రతిబంధకాలను ఎదుర్కొంటోంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు తీవ్ర వర్షాభావ పరిస్థితులవల్ల వ్యవసాయం దెబ్బతింటోంది. మరో వైపు వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. దిగుబడులు తగ్గిపోతున్నాయి. పర్యావసానంగా రైతులకు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు దక్కని పరిస్థితి దాపురించింది. మిర్చి, పత్తి, వేరుశెనగ, పొగాకు వంటి వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడంలేదు. భూములున్న వాళ్లు పిల్లల చదువుల కోసం పట్టణాలకు మకాం మార్చుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని తోటలు, పొలాలు కౌలుకు ఇస్తున్నారు. కౌలు ధరలు పెరిగిపోయాయి. అధిక వడ్డీలకు తెచ్చి వేలకు వేలు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి. కౌలుదారులు, పెట్టుబడులు పెడుతున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అధిక వడ్డీ అప్పులు తాళలేక, కౌలు పెరిగిపోయి, లాభసాటి ధరలు లేక ఇలా అనేక సమస్యలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి దాపురించింది. రుణాలు సకాలంలో అందకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు విత్తన సరఫరాలో లోపాలు కన్పిస్తున్నాయి. నకిలీ విత్తనాలు చెలామణి అవుతున్నాయి. రైతుల్లో సంఘటిత శక్తి లోపం వుంది. పంటను అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కుటుంబ ఖర్చులు పెరిగిపోయి, వ్యవసాయం గిట్టుబాటు కాక, మద్ధతు ధర ప్రకటించేంత వరకు దిగుబడిని దాచుకునే వెసులుబాటు లేక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పెరిగిన కుటుంబ ఖర్చులకు సరిపడా ఆదాయం వ్యవసాయం నుంచి రావడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ కాస్తంత ఉపశమనం కలిగించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రుణాలను ఒకేసారి కాకుండా దపదఫాలుగా మాఫీచేయడానికి చర్యలు చేపట్టడం జరిగింది. దపదఫాలుగా రూ.1.50 లక్షల వరకు రుణ మాఫీ జరిగింది.
ఒకేసారి రూ.50 వేలు రుణ మాఫీ జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం రాష్ట్రానికే పరిమితం కాదు..రైతులు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందుకే దేశవ్యాప్త రైతాంగ సమస్యగా పరిగణించి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. రైతుల సమస్యలను పరిష్కరించడానికి రాష్టమ్రే పెనుభారంగా మోయలేదు. లక్షల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్న వారికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ల పేరుతో మాఫీ చేస్తున్నారు. మొండి బకాయిలను రద్దు చేసేస్తున్న పరిస్థితులు వున్నాయి. దేశవ్యాప్తంగా అన్నం పెడుతున్న రైతులకు ఒకసారి రుణ మాఫీ చేస్తే పెద్ద నష్టమేమీ కాదు. అందుకే దేశవ్యాప్త సమస్యగా పరిగణించి రైతులను కేంద్ర ప్రభుత్వం రుణ విముక్తులను చేయాలి. అందుకే జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూడా వ్యవసాయ పనులకు అన్వయించాల్సివుంది. ఈ విధంగానైనా వ్యవసాయ ఖర్చులు తగ్గే విధంగా కాస్తంత ఊరట ఇవ్వాలి.

-గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే