ఫోకస్

‘స్వశక్తి’ కోసం రైతులకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయం పండగలా మార్చేందుకు మేము (రాష్ట్రప్రభుత్వం) బృహత్‌ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సేద్యం రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. రైతులు స్వశక్తిపై ఎదిగే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాం. బ్యాంకుల నుండి రుణాలు ఇప్పిస్తున్నప్పటికీ, అసలు రుణాల అవసరం లేని విధంగా రైతులు ఆర్థికంగా ఎదిగేలా ఫకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న విధానాల్లో కొన్నిలోపాలున్నాయి. ఈలోపాలను సరిదిద్దాల్సి ఉంది. రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తోంది. పరిశ్రమలను ఏర్పాటు చేసుకుంటున్న వారు తాము చేసే ఉత్పత్తులకు ధరలను వారే నిర్ణయిస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులు, వారి లాభాలు కలిపి ధర నిర్ణయిస్తూ, వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. కాని రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కేంద్రం ఏర్పాటు చేసే ధరల నిర్ణాయక కమిషన్ పంటల ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తోంది. అది నిర్ణయించే ధరలు శాస్ర్తియంగా ఉండటం లేదన్నది నా భావన. స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టేపెట్టుబడితో మరో యాభై శాతం కలిపి ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ విధానం మంచిదే అయినా అమల్లోకి రాలేదు. ఒక్కోసారి రైతుల పెట్టుబడి కూడా రాని పరిస్థితి వస్తోంది. ఈ విధానంలో సమూల మార్పులు రావాలని మేము ప్రయత్నిస్తున్నాం. పంటల ఉత్పత్తుల ధరలను నిర్ణయించేందుకు మేము (రాష్ట్ర ప్రభుత్వం) చేసే సిఫార్సులను అమలు చేసేలా ప్రయత్నిస్తున్నాం.
2014 ఎన్నికలు జరిగే ముందే మా పార్టీ చేసిన సర్వేకు అనుగుణంగా రైతాంగాన్ని ఆదుకునేందుకు ‘రుణమాఫీ’ పథకాన్ని ప్రకటించాం. అధికారంలోకి రాగానే ఈ హామీని అమలు చేయడం ప్రారంభించి దాదాపు 36 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరేలా 17 వేల కోట్ల రూపాయలను మాఫీ చేశాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహాలో రైతుల రుణమాఫీ జరగలేదు. వ్యవసాయంపై మేము అధ్యయనం చేశాం. రైతుల అవసరాలు తీర్చేందుకు యత్నిస్తున్నాం. తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలను ఇస్తూ, సకాలంరో ఎరువులను ఇస్తున్నాం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. పెట్టుబడులు తగ్గించేందుకు యంత్రాలను సబ్సిడీపై ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న చెరువులు, కుంటలను బాగుచేస్తున్నాం. కృష్ణా, గోదావరి జలాలను పొలాలకు తరలించేందుకు ప్రణాళికలను రూపొందించి, గతంలో లేని విధంగా ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు భారీగా ఇస్తున్నాం. కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేలా పనుల చేస్తున్నాం. అంటే రాష్టమ్రంతా సస్యశ్యామలం అవుతుంది. రైతుల సమస్యలు తీరితే ఆత్మహత్యలకు అవకాశం ఉండదు. ‘వ్యవసాయం పండగ’ అన్న విధంగా మారుస్తున్నాం.

-పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం