ఫోకస్

అపోహలు తగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఎన్నికలు మరింత స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అపోహలు తగవు.. ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోటంలో తప్పులేదు.. అసలు ఈ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టం.. ఎన్నికల్లో వీటిని ఉపయోగించరాదంటూ ఓటమిపాలైన రాజకీయ పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అనూహ్యరీతిలో బిజెపి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు బిజెపికి అనుకూలంగా పనిచేసాయనే ఆరోపణలు ఏ మాత్రం సరైనవి కావు. ఆ ఆరోపణలన్నీ అర్థరహితం. విపక్షాలు గెలిచిన స్థానాల్లో యంత్రాలు బాగా పనిచేసాయని భావించాలా! ఈ ప్రక్రియలో ఏమైనా లోపాలను గుర్తిస్తే ఆధారాలతో ఎత్తిచూపడంలో ఏ మాత్రం తప్పులేదు. అయితే ఇంతవరకు ఎక్కడా ఎవరూ ఏ ఒక్క లోపాన్ని నిరూపించలేకపోయారు. అయితే తొలి రోజుల్లో అక్కడక్కడ కొన్ని లోపాలు జరిగినట్లు మేధావుల మధ్య చర్చ జరిగిన మాట వాస్తవమే.. ఏది ఏమైనా పారదర్శకత కోసం ఓటరు తాను ఏ గుర్తుకు ఓటు వేసిందీ తెలుసుకోవటానికి వీలుగా వెంటనే స్లిప్ వచ్చేలా సరిచేస్తే చాలు..

- కాల్వ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి