ఫోకస్

హామీని ఉల్లంఘిస్తే యువతలో అశాంతే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి హామీలు ఇవ్వడం, కంటితుడుపుగా జీవోలు ఇవ్వడం, కోర్టులు వాటిని కొట్టేయడం పరిపాటిగా మారింది. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం. దీని వయస్సు మూడేళ్లు. కెసిఆర్ ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో యువత ఓట్లు వేశారు. ఈ రోజు ఏమైంది. మరో రెండేళ్లలోపు ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఇంతవరకు కేవలం 700 మందిని మాత్రమే పర్మినెంట్ చేశారు. 25వేల మంది సంగతి ఏమిటి. 2016 ఫిబ్రవరిలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే విధంగా జీవో ఇచ్చారు. ఆ జీవోను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులపై మార్గదర్శకాలను ఇచ్చింది. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, భూసేకరణ చట్టం అన్నింటిలో కెసిఆర్ విధానాల వల్ల కోర్టుల్లో చుక్కెదురవుతోంది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి న్యాయ కోవిదులను సంప్రదించి వారి సలహాను స్వీకరించాలి.

- కె శివకుమార్, ప్రధాన కార్యదర్శి వైకాపా తెలంగాణ రాష్ట్ర విభాగం