ఫోకస్

పీఠాధిపతులను సంప్రదిస్తే బాగుండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాలకు సంబంధించి కొత్తగా జీఓలు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాదాయ శాఖ భావించినా, చట్టాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని భావించినా రాష్ట్రంలోని పీఠాధిపతులు, మఠాధిపతుల సలహాలు, సూచనలు తీసుకుంటే బాగుంటుంది. వీరి సలహాలను పాటించాలి. ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ పనితీరు అధ్వాన్నంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవాదాయ శాఖ ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ అధీనంలో కొనసాగుతోంది. దేవాలయాల భూములను పరిరక్షించడంలో విశాఖ శ్రీశారదాపీఠం మొదటి నుండి పోరాడుతూనే ఉంది. గత 20 సంవత్సరాల నుండి పోరాటం సాగిస్తున్నాం. ఆలయ భూములకు సంబంధించి ప్రభుత్వ తాజాగా జారీ చేసిన జీఓ 426 ద్వారా దేవాదాయ భూములకు రక్షణ లభిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి నుండి దేవాదాయ, ధర్మాదాయ భూముల రక్షణ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు ఏవీ తీసుకోవడం లేదు. అందుకే వేలాది ఎకరాల భూములు ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం ఎండోమెంట్స్ అధీనంలో భూములు ఎన్ని ఉన్నాయి. వాటి వల్ల ఆలయాలకు లభిస్తున్న ఆదాయం ఎంత? ఆక్రమణకు గురైన భూములు ఎన్ని ఉన్నాయి? వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్న విషయాల్లో సమగ్రమైన చర్చ జరిగితే బాగుండేది. 426 జీఓ ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు భూములను లీజ్ పేరుతో ఇవ్వడం వల్ల వచ్చే మంచిఫలితాలు, చెడుఫలితాలు (మెరిట్స్-డీమెరిట్స్) ఏ విధంగా ఉంటాయో అధ్యయనం చేస్తే బాగుండేది. జీఓలు జారీ చేసే ముందు పీఠాధిపతులు, మఠాధిపతులు, దేవాలయ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదించడంలో ఎలాంటి తప్పు లేదు. ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, చట్టాల్లో సవరణలు చేయాలని భావించినా, జీఓలు జారీ చేసినా, తొలుత హిందూభక్తుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేది. దేవాలయాల్లో రోజువారీ పూజలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాలకు పెద్దఎత్తున నిధులు అవసరం అవుతుంది. దేవాలయాల ఆస్తులను మతప్రచారానికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దేవాలయాలకు-మతప్రచారానికి ఎలాంటి సంబంధం లేదు. చిన్న ఆలయాలకు లభించే కొద్దిపాటి ఆదాయాన్ని మతమార్పిడి నిరోధించేందుకు వీనియోగించాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి నిధులు ఆలయాల్లో జరిగే ఉత్సవాలకే వ్యయం చేయాలి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) మతమార్పిడికి చర్యలు తీసుకుంటే తప్పేమీ లేదు. దేవాలయ అర్చకుల నియామకాల విషయంలో ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండాలి. పీఠాధిపతులు, వేదపండితులు, ఆగమ పండితులు నిర్ణయించేవారినే అర్చకులుగా నియమించాలి. చాలా సంవత్సరాల పాటు పనిచేస్తున్న పరిచారకులకు అర్చకుల నియామకాల్లో ప్రాధాన్యత ఉండాలి.

- స్వరూపానందేంద్ర సరస్వతి శ్రీ శారదా పీఠాధిపతి, విశాఖపట్నం