ఫోకస్

సుప్రీంను ఆశ్రయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే ఇవ్వడం వల్ల బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు వెళతాం. కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఒకదాని తరువాత ఒకటి ఎన్నికల హామీలు అన్నీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తోంది. దానిలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొంత మంది కోర్టుకు వెళ్లడం వల్ల ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఎంతో కాలం నుంచి కాంట్రాక్టు ఉద్యోగులగా పని చేస్తున్న వీరిని క్రమ బద్ధీకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి న్యాయస్థానాల నుంచి సానుకూలత వ్యక్తం అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాం. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకొని వారిని పర్మినెంట్ చేయరాదు అని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల్లో రకరకాల వారు ఉన్నారు. పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేదు కానీ మిగిలిన వారిని చేయవచ్చు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీలు ఉండి, రోస్టర్ విధానం పాటించి, నోటిఫికేషన్ ఇచ్చి అన్ని నిబంధనలు పాటించి కాంట్రాక్టు ఉద్యోగులుగా చేర్చుకున్న వారిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిబంధనలు పాటించలేదు అని హైకోర్టు స్టే ఇచ్చింది. గతంలో కాంట్రాక్టు ఉద్యోగులకు 18వేల రూపాయలు ఇచ్చే వాళ్లు, టిఆర్‌ఎస్ ప్రభుత్వం వారికి 40వేల రూపాయల వరకు వేతనాలు పెంచింది. కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ అనేది ఒక సారి ముగింపు పలకాలని అందరు ఉద్యోగులు సమానమే అన్నట్టుగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దీన్ని బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు వివరిస్తాం. ఉద్యోగాల్లో ఖాళీలు ఉండి, పూర్తి కాలం పని చేయడం కోసం, రోస్టర్ విధానం ద్వారా నియామకాలు జరిగిన ఉద్యోగులనే క్రమ బద్ధీకరించాలనేది ఉద్దేశం. న్యాయస్థానాల్లో అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాః తెలంగాణలో ఉద్యోగులు అందరూ తెలంగాణ కల సాకారం కావాలని కోరుకున్నారు. సాకారం అయిన తెలంగాణలో తమ పరిస్థితి మెరుగు పడుతుందని ఆశించారు. ఉద్యోగుల క్రమ బద్ధీకరణ టిఆర్‌ఎస్ ఎన్నికల హామీ. ఈ హామీని ప్రభుత్వ అమలు చేయాలనే భావిస్తోంది

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ విప్ తెలంగాణ శాసన మండలి