ఫోకస్

నైపుణ్యం ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోర్ యాక్టివిటీ పెరిగినపుడు ఐటి ఉద్యోగాల్లో కోత పడే పరిస్థితే తలెత్తదు.. ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పెనుమార్పులతో విస్తరిస్తోంది.. ఆ దిశగా ఆలోచనా విధానం మారితే ఐటి ఉద్యోగాలకు ఢోకా వుండదు. కోర్ యాక్టివిటీ పూర్తిస్థాయిలో జరగలేదు కాబట్టే ఐటి ఉద్యోగాల్లో స్తంభన ఏర్పడుతోంది. అందరూ ఇన్‌ఫర్మేషన్ అని కూర్చోవడం సరికాదు.. క్షేత్రస్థాయిలో కోర్ యాక్టివిటీ అభివృద్ధి కావాలి.. అలాకాకపోతే అవకాశాలు పరిమితంగానే వుంటాయి. ఐటితోపాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి రంగాలన్నీ ముఖ్యమే. ఈ విధంగా కోర్ ఇండస్ట్రీ పెరిగితే ఐటి ఉద్యోగాలకు కూడా ఢోకా వుండదు. అందరూ ఐటి ఉద్యోగాలకే ఎగబడ్డం సరికాదు. ప్రైవేటు కంపెనీలు కూర్చోబెట్టి జీతాలివ్వలేవు. వాటి పరిధులకు లోబడి అవకాశాలు కల్పిస్తాయి. వాటిని అందుకునేందుకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాల్సిందే. వారి అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పిస్తారు గానీ, ఐటిని అభివృద్ధి చేయడానికి ఉద్యోగాలు కల్పించరు. కాబట్టి ప్రపంచ పరిణామాలను బట్టి ఎప్పటికపుడు నూతనత్వాన్ని సంతరించుకుంటూ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ శరవేగంగా మారుతోన్న పోటీతత్వానికి నిలబడినపుడు ఎటువంటి ఒడిదుడులకు తావుండదు. ఐటి ఒక్కటే సర్వస్యం కాదు. టెక్నాలజీ అనేది నిరంతరం మార్పు చెందుతూనే వుంటుంది. సాంకేతికంగా మార్పులు వస్తున్నాయి. నూతన పోకడలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న అవసరాలకు, మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవాల్సి వుంది. భారతీయులు ప్రపంచస్థాయిలో ఐటి రంగంలో ఎంతో అనుభవజ్ఞులుగా వున్నారు. అవసరం దిశగా వృత్తి నైపుణ్యం అభివృద్ధి చెందినపుడు అవకాశాలు మనవెంట తిరుగుతాయి. అవకాశాల వెంట ఐటి తిరగకుండా.. ఐటి చుట్టూ అవకాశాలు తిరిగే విధంగా పరిమితులను విస్తరించుకోవాల్సి వుంది. అపుడు ఎక్కడికెళ్ళినా.. ఎక్కడ వున్నా అవకాశాలు వెతుక్కుని వస్తాయి. ఐటి విషయంలో మన డిమాండ్ ఔన్నత్యాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచన సాగించాలి. ఐటితోపాటు అన్ని రకాల సాంకేతికత అనుబంధంగా విస్తరించాలి. అపుడు ఒకదానికి ఒకటి అనుసంధానంగా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. మూస పద్ధతుల్లో వెళ్తే అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. కాలానికి అనుగుణంగా అప్‌డేట్ కావాల్సి వుంది. అపుడు ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు దక్కుతూనే వుంటాయి.

-డాక్టర్ ఆకుల సత్యనారాయణ బిజెపి ఎమ్మెల్యే, రాజమహేంద్రవరం అర్బన్