ఫోకస్

అప్‌డేట్ చేసుకోవాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిస్టమ్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోని పక్షంలో కంప్యూటర్లకు వైరస్ ముప్పు పొంచి వుంటుంది. సైబర్ ఎటాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. 2017 మే 12 రాత్రి జరిగిన హాకర్ల సైబర్ ఎటాక్‌కు ప్రపంచ వ్యాప్తంగా కలకలం చెలరేగింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు, ప్రత్యేకించి విండోస్ 7కు వైరస్ ప్రాబ్లమ్ వచ్చింది. దీనివలన సుమారు 2 లక్షలకు పైగా సిస్టమ్స్‌కు ఇది ఎఫెక్ట్ అయ్యింది. సిస్టమ్స్ స్క్రీన్‌పై ఒక మెసేజ్‌ను ఇవ్వడం ద్వారా హ్యాకర్స్ ఈ సైబర్ దాడికి పాల్పడ్డారు. ఒక్కొక్కరు కనీసం 20వేల నుండి 40వేల రూపాయల వరకు (్భరత కరెన్సీలో) బిట్ కాయిన్ విధానంలో చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విధంగా మే 12నుండి 19వ తేదీ మధ్యలో సుమారు 60 లక్షల రూపాయలను వసూలు చేశారు. విషయం తెలిసిన వెంటనే మైక్రోసాఫ్ట్ కంపెనీ సిస్టమ్స్‌ను అప్‌డేట్ చేసుకోవల్సిందిగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. అయితే అప్పటికే ఎఫెక్ట్ అయిన సిస్టమ్స్‌కు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడినా, ఎఫెక్ట్ కాని సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ సమస్యను చాలామంది అధిగమించారు. ఒక్క ఇండియాలోనే 11 శాతం సిస్టమ్స్ ఈ వైరస్‌కు ఎఫెక్ట్ అయ్యాయి. కొందరు భయపడి హ్యాకర్లకు బిట్ కాయిన్ విధానంలో మనీని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇండియాతోపాటు రష్యా, ఉక్రెయిన్, థైవాన్ వంటి దేశాలకు ఈ చర్యవల్ల నష్టం ఎక్కువగా జరిగింది. రైల్వే, పోలీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్ వంటి వాటికి నష్టం కలిగింది. కాలం చెల్లిన కంప్యూటర్లను వాడటంవల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. సిస్టమ్స్ విషయంలో ప్రతి ఒక్కరు అప్‌డేట్ కావల్సి ఉంది. హ్యాకర్ల దాడిలో 99 శాతం వరకు విండోస్-7 సిస్టమ్స్ ఉన్నాయి. అయితే విండోస్-10కు వైరస్ ఎఫెక్ట్ కాలేదు! ఎటాక్ గురించి తెలియగానే మైక్రోసాఫ్ట్ వారు ఇచ్చిన అప్‌డేట్‌ను వెంటనే చేసుకున్నవారు సేవ్ అయినప్పటికీ, ఇకపై ముందుజాగ్రత్తగా ప్రతి ఒక్కరు అప్‌డేట్ కావడం మంచిది.

- ప్రొఫెసర్ కె.వి.రమణ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్, జెఎన్‌టియు, కాకినాడ