ఫోకస్

అభివృద్ధిలో ముందడుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత మూడేళ్ళుగా అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. గత పాలకులు అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, వేల కోట్ల రెవెన్యూ లోటుతో పాటు కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు. ప్రత్యేక విజన్‌తో రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అక్కడి ప్రజలు సుమారు 32వేల ఎకరాల భూమిని ఇవ్వడం చంద్రబాబుపై ఉన్న నమ్మకానికి నిదర్శనం! ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ ఐటి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక విజయవాడ, విశాఖ నగరాల్లో కార్యకలాపాలు సాగించేందుకు అనేక ఐటి కంపెనీలు ముందుకువస్తున్నాయి. తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి ఇటీవల విదేశాల్లో పర్యటించి వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించి, ఎంఒయులు కుదుర్చుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కలను సాకారం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. 2018 సంవత్సరాంతానికి పోలవరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసే దిశగా కృషి చేస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరుగులు తీయిస్తున్నారు. అనేక బహుళజాతి సంస్థల నుండి పెట్టుబడులను రాబట్టడంలో ఈ మూడేళ్ళలో ఎంతో కృషి చేశారు. చంద్రబాబు కృషి కారణంగా రాష్ట్రంలో అనేక భారీ పరిశ్రమలు కొలువుదీరడం తథ్యం!

- తోట నరసింహం, కాకినాడ ఎంపీ, లోక్‌సభలో టిడిపి ఫ్లోర్‌లీడర్