ఫోకస్

ప్రజలు సంతోషంగా ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఎనె్నన్నో కార్యక్రమాలు చేపట్టారు. సాగు నీరు, తాగు నీరుకోసం మిషన్ కాకతీయను వేగవంతం చేశారు. విత్తనాలు, ఎరువులు అందించడం, ఎకరానికి నాలుగు వేలు ఇవ్వడం, ‘ఆసరా’, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగుల పెన్షన్లు, ఆహార భద్రత, వసతి గృహాల్లో సౌకర్యాలు పెంచడం, రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు నెలకొల్పడం గొప్ప విషయం. గతంలో ఆరు ఉర్దూ పాఠశాలలు ఉంటే ఇప్పుడు 203కు పెంచాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చొరవ తీసుకుని చర్యలు చేపట్టారు. రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పేద ముస్లింలకు, పేద క్రిస్టియన్లకు కిట్స్, గిఫ్ట్స్ అందిస్తున్నారు. బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకునేలా నిధులు విడుదల చేస్తున్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచకపోవడంపట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆస్థి పన్నును తగ్గించారు. పేద ముస్లిం మహిళలకు షాదీ ముబారక్ పేరిట ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలబడ్డారు. హిందువుల్లోని పేద మహిళలకు కళ్యాణ లక్ష్మి పేరిట ఆదుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత శాంతి-్భద్రతలు సజావుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.

- సయ్యద్ అమీన్ జాఫ్రీ, ఎమ్మెల్సీ, మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు