ఫోకస్

అబద్ధాల్లో మేటి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ అబద్దాలలో మేటిగా నిలుస్తున్నారు. ఎన్నికలకంటే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అటకెక్కించారు. అర్హులైన ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు. ఈ మూడేళ్లలో రెండువేల ఎకరాలకు మించి పంపిణీ చేయలేకపోయారు. డబల్‌బెడ్‌రూం ఇళ్లను పేదలందరికీ ఇస్తామని ప్రకటించిన కెసిఆర్ తన సొంత నియోజకవర్గంలోని రెండు గ్రామాల్లో మాత్రమే పేదలకు ఇళ్లు కట్టించి, రాష్టమ్రంతటా ఇళ్లను కట్టించినట్టు భ్రమ కల్పిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చాటింపు వేయించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో భూమిని నాగలితో దున్నిస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో బాహాటంగా ప్రకటించి, ఇప్పుడు తాను అలా అనలేదంటూ బుకాయిస్తున్నారు. నీటి పారుదుల ప్రాజెక్టుల పనులు చాలాకాలం నుండి నడుస్తూనే ఉన్నాయి. చత్తీస్‌గఢ్ నుండి కరెంట్ తెస్తానని, ఇప్పటివరకు తేలేదు. ప్రాధాన్యతా రంగాలను మరిచిపోయి, నిర్లక్ష్యం చేస్తూ, అనవసరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

- కె. నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి