ఫోకస్

తెలంగాణ.. దేశానికే దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివక్షకు గురైన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 2001లో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం అభివృద్ధి కొనసాగుతోంది. మూడేళ్లలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టి దేశానికే దిక్చూచిగా మారింది. ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చే విధంగా జిల్లాల విభజన చేసాం. ఆర్థిక పరిపుష్టి అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలు చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. కరెంటు కోతలతో ఎదుర్కొన్న అవస్థలు తొలగిపోయాయి. తెలంగాణలో పంటలే పండవని, ఖర్చులు దండుగ అంటూ చేసిన ఎగతాళికి సమర్థవంతంగా సమాధానం ఇస్తున్నాం. ఆరుతడి, నీరుతడి పంటలతో రైతులు పండుగ చేసుకుంటున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తెలంగాణాలో ఎకరానికి సాగునీరు లభించకపోగా మూడేళ్లలోనే సంగారెడ్డి జిల్లాలోని అందోల్, పుల్‌కల్ మండలాల్లో 30 ఎకరాలకు నీరందించి భూమలను సస్యశ్యామలం చేసాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, శాంతిభద్రతల పరిరక్షణ, కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్, ఆసరా పింఛన్లు, విద్యార్థులకు సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన భోజనం, కుల వృత్తుల పరిరక్షణ, గీత, చేనేత కార్మికులకు పింఛన్లు తదితర అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ 29 రాష్ట్రాల్లో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది. ఇచ్చిన హామీలకు అదనంగా కొత్త కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కింది. రాష్ట్ర అభివృద్ధికోసం నిరంతరం పరితపిస్తూ ఉద్యోగులు, వ్యవసాయం, కార్మికులతోపాటుగా కుల వృత్తిదారులను ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రిగా జనంలో ముద్ర వేసుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలతో సమానంగా తన పనితీరుపై తానే సర్వే చేయించుకుని ప్రజల నాడిని పసిగట్టారు. ఏదిఏమైనా మూడేళ్లలో చూడముచ్చటైన అభివృద్ధిని సాధించాం.

- పద్మా దేవేందర్‌రెడ్డి, ఉప సభాపతి