ఫోకస్

మరింత కఠిన చట్టాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌కోసం అన్ని విధాలుగా దోహదపడే గోవుల సంరక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు ఏమాత్రం సరిపోవు. ఇంకా కఠినతరమైన చట్టాలు అవసరం. గోవులు కేవలం ఒక్క వ్యవసాయానికే పనికి వచ్చే గిత్తలను అందించడమేకాదు కుల, మత, వర్గ, లింగ, వయో బేధాల కతీతంగా మనిషి ఆరోగ్యానికి ఆవుమూత్రం ఉపకరిస్తుంది. పలు వ్యాధులకు దారితీసే శరీరంలోని రక్తాన్ని ఆవుమూత్రం పూర్తిగా శుద్ధిచేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంకోసం కష్టార్జితం మొత్తాన్ని ధారపోసే దుస్థితి లేకుండాపోతుంది. పుల్లటి మజ్జిగ పంట తెగుళ్లను నాశనం చేస్తుంది. ఆవు పేడ ఎంతో బలమైన ఎరువుగా ఉపకరిస్తుంది. ఆవు చనిపోయిన తర్వాత ఆవు శరీరంలోని అన్ని భాగాలు కూడా వ్యవసాయానికి ఎంతగానో ఉపకరిస్తాయి. ప్రధానంగా కొమ్ములు, కాలిగిట్టలను వ్యవసాయ భూమిలో నిలువ చేస్తే కొద్ది రోజులకే బలమైన ఎరువుగా మారుతుంది. గతంలో సగటున ఒక్కో మనిషికి రెండు ఆవులు చొప్పున ఉంటే ప్రస్తుతం ఒక్క అవు కూడా లెక్కకు కన్పించని దుస్థితి నెలకొంది. అందుకే ఆవుల పెంపకారికి. సంరక్షణకు ప్రభుత్వాలు మరింతగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
- జలగం కుమారస్వామి
భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విజయవాడ