ఫోకస్

చట్టపరిధిలో జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవులను వధించడం, గోవులను రక్షించడం వంటివి చట్టపరిధిలోనే జరగాలి. గోవులను వధిస్తున్నారని, గోవులను హింసిస్తున్నారని అల్లర్లు సృష్టించడం మంచిది కాదు. గోవుల రక్షణకు చట్టం కొత్తగా తెచ్చిందేమి కాదు. ఇది పాత కాలం నాటి చట్టమే. అదేవిధంగా గోవులను వధించడమూ అంతే. అయితే ఇవి చట్టపరిధికి లోబడి జరిగితే అందరికీ మంచిది. కానీ స్వప్రయోజనాల కోసం చట్టాలను తమ చేతిలోకి తీసుకోవడం, చట్టలొసుగుల ముసుగులో గోవధ జరపడం వంటిది జరగకూడదు. చట్టాలను గౌరవిస్తూ, చట్టపరిధిలో ఏ పనిచేసినా అది అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. కానీ చట్టాన్ని అతిక్రమించి చేసే పనులు శాంతిభత్రలకు విఘాతం కలిగించే చర్యలు అవుతాయి. అంతేకాకుండా ఒక వర్గంపై మరో వర్గం దాడులకు దిగబడే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా..పాలకులు ఎవరైనా చట్టాన్ని గౌరవించాలి. చట్టంపై విశ్వాసం కలిగించాలి. పశుసంపద అన్నది వ్యవసాయరంగానికి అతిప్రీతి. మరీ అలాంటి సంపదను కాపాడుకోవడం అందరి ధర్మత. పశువులను కాపాడుకోవడం కొంత మేర ఇబ్బంది కలిగించొచ్చు. కానీ పశువులను కాపాడుకుంటే వచ్చే ప్రయోజనం అమితంగా ఉంటుంది. కానీ దేశంలో అక్కడక్కడా పశు సంరక్షణ పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. ఒక వర్గంపై దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇవన్నీ చట్టలొసుగులు కావు. చట్టం అతిక్రమించడం కాదు. ఇది సమన్వయంతో కూడిన సమస్య. ఈ సమస్యను కాస్త సామరస్యం, సమన్వయంతో పరిష్కరించుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తవు.
- పేర్వారం రాములు,
మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్