ఫోకస్

ప్రయోజనం ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులను పట్టించుకునే ప్రభుత్వాలు లేవు. రైతులకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో కెసిఆర్ రైతులకు చాలా మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. కాని ఆచరణలో వారికి ఎటువంటి ఫలాలు అందడం లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 39ని రద్దు చేయాలి. ఇది కేవలం పార్టీ కార్యకర్తల వేదికగా తయారైంది. మండలాల నుంచి జిల్లాలు, రాష్ట్ర స్ధాయి వరకు రాజకీయ నియామకాలు జరుగుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు నేరుగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ చేరేందుకు, రైతుల సంక్షేమంకోసం సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆచరణలో ఇవేమీ జరగడంలేదు. రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. చంద్రబాబు, కెసిఆర్ విధానాలు రైతులకు దండగగా మారాయి. పొంతనలేని వ్యవసాయ విధానాలు రెండు రాష్ట్రాల్లో అమలవుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు పూర్తిగా ప్రతిరైతుకు రుణ మాఫీ ఫలాలు అందించేటట్లు చర్యలు తీసుకోలేదు. అనేక సబ్సిడీలను ప్రకటించారు. కాని రైతులకు అందడం లేదు. కెసిఆర్ ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తున్నారు. కాని వాస్తవంలో రైతాంగానికి అందే ఫలాలపై ఇంతవరకు రైతులనుంచి స్పందన లేదు. ఆ మధ్య మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఉద్యమించారు. ఈ ఏడాది పత్తిపంటను బాగావేశారు. ఇప్పటి నుంచి ప్రభుత్వం పత్తిరైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు జీవో 39పై ఇస్తున్న సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటించాలి
- కె శివకుమార్
ప్రధాన కార్యదర్శి, వైకాపా తెలంగాణ శాఖ
.