ఫోకస్

అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికార దుర్వినియోగం, డబ్బు రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీసహా కాంగ్రెస్, టిడిపి, బిజెపి ఖూనీ చేస్తున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ వ్యవహార శైలి గెలుపు ఒక్కటే లక్ష్యంగా పెట్టుకుని అన్ని అడ్డదారులూ తొక్కుతోంది. మొన్న మండలి ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కు నాలుగే నాలుగు ఓట్లు ఉంటే, అక్కడ గెలిచింది. ఎలా గెలిచిందో, దాని బలమేంటో అప్పుడే తేలిపోయింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్ ఎంతకైనా తెగిస్తుంది. ఇందుకు కాంగ్రెస్, టిడిపి కూడా ఏమీ తీసిపోలేదు. ఎలా గెలవాలన్నదే తప్ప ఏ పద్ధతిలో ప్రచారం చేయాలి, ఏ పద్ధతిలో పోటీ చేయాలన్న లెక్కేలేదు. అధికార బలంతో జిహెచ్‌ఎంసి పీఠాన్ని దక్కించుకోవాలని టిఆర్‌ఎస్ విశ్వప్రయత్నం చేస్తోంది తప్ప ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కనిపించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం అంటే స్పూర్తిదాయకంగా ఉండాలి, కానీ ఇందుకు విరుద్ధంగా అనారోగ్యకర పోటీ వాతావరణం రాజ్యమేలుతోంది. ఇది ఏ పార్టీకీ మంచిది కాదు. ఇక ప్రజాప్రతినిధుల్లో కూడా చాలా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎన్నికైన వాళ్లు అమ్ముడుపోయినంతకాలం కొనేవాళ్లు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ప్రజాస్వామ్య విలువలను గుర్తించి అమ్ముడుపోవడమనేది మానుకోవాలి. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం అనేది అధికార పార్టీలకు అదో సంప్రదాయంగా మారిపోయింది. ఈ దురదృష్టకర పరిస్థితులకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక నిబంధనలు ఉల్లంఘన, ప్రచార తీరు, డబ్బు వెదజల్లడం, లెక్కకు మించిన ఖర్చులు వంటివాటిపై నిఘా ఉంచాల్సిన ఎన్నికల సంఘం ఉత్సవ విగ్రహంగా మారిపోయింది. ఎన్నికల సంఘం చరిత్రలో ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎన్నికల సంఘానికి ఉన్న పరిమితుల మేరకు వ్యవహరించడం తప్ప ఎవరిపైనా చర్యలు తీసుకునే సాహసం చేసేందుకు అవకాశం లేదు. పార్టీల వ్యవహార శైలిలో మార్పు రావాలే తప్ప ఎన్నికల సంఘం వల్ల ఏమీ చేయగలిగింది లేదని ఎన్నోసార్లు రుజువైంది.

- కె.నారాయణ సిపిఐ, జాతీయ కార్యదర్శి