ఫోకస్

స్వేచ్ఛను అడ్డుకోలేం కదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం పాలసీపై ప్రభుత్వ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఏదైతే హామీ ఇచ్చిందో వాటిని అమలు చేసింది. గ్రామాల్లో బెల్టుషాపులను, అక్రమ మద్యం సరిఫరాను అరికట్టారు. గతంలో ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం పూర్తిగా నిషేధించడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందువల్లనే ప్రభుత్వం మద్యం పూర్తిగా అరికట్టకుండా విచ్చలవిడితనం లేకుండా చేయాలని భావించింది. అందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు పూర్తి స్వేచ్చ ఉంది. దేనిని పూర్తిగా నిషేధించడం సాధ్యపడదు. గతంలో దివంగత ఎన్‌టి రామారావు హయాంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించినపుడు అక్రమ మద్యం పెరిగిపోయింది. దాంతోపాటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గింది. మద్యం అమ్మకాలపై నిషేధం విధించడం వల్ల తాగుబోతులు ఇతర రాష్ట్రాల నుంచి వాటిని కొనుగోలు చేసేవారు. ఆ విధంగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అందువల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ ఉండవచ్చు గానీ విచ్చలవిడితనం ఉండకూడదనే ఆలోచనతో ఉన్నారు. అందువల్లనే గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేశారు. దానివల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయి. ఆ విధంగా గ్రామాల్లో సక్సెస్ అయ్యింది. మద్యం నిషేధించాలని ధర్నాలు చేసిన మహిళలు కూడా నేడు సంతోషంగా ఉన్నారు. అయితే మద్యం అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజలు ఎక్కువగా మద్యం తాగడంవల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. నేడు జిఎస్‌టి అమల్లోకి వచ్చింది. అది కేంద్రం, రాష్ట్రం కలిపి వేయాల్సిన పన్ను. అయితే పెట్రోలు, లిక్కర్ వస్తువులపై జిఎస్‌టి విధించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మద్యం ప్రధాన ఆదాయ వనరుగా మారిందనడంలో నిజం లేదు. నేడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్ధికి, ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అలాంటపుడు మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రధాన వనరు ఎలా అవుతోంది? ప్రభుత్వం మద్యం పాలసీపై చాలా స్పష్టంగానే ఉంది. ప్రజల స్వేచ్చకు అడ్డుకట్ట వేయలేం కదా.
- ద్వారపురెడ్డి జగదీష్ ఎమ్మెల్సీ, విజయనగరం