ఫోకస్

ప్రశాంతంగా జరుగుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూస్తాం.. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. శాంతి భద్రతల పరిరక్షణకు నగర పోలీసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పిస్తాం. ఎన్నికలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం నగరంలో 14,716 మంది సిబ్బంది అవసరం కాగా 9,821 మాత్రమే ఉన్నారు. 4,895 పోస్టులు ఇంకా భర్తీ కావలసి ఉంది. నగర ప్రజలు బోనాలు, రంజాన్, బక్రీద్, మొహర్రం, బతుకమ్మ, సంక్రాంతి వంటి పండుగలు ప్రశాంతంగా నిర్వహించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు. ఈ వేడుకల అనుభవంతోనే నగరంలో ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం పోలీసు వ్యవస్థకు కొత్త టెక్నాలజీ సమకూరింది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యక్ష దర్యాప్తు, విచారణలను గమనించవచ్చు. సిసి కెమెరాలతో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించవచ్చు. పోలింగ్ సరళి, సిబ్బంది పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేలా టెక్నాలజీ సమకూరింది. నగరంలో గత అనుభవాలతో శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తాం. ఎన్నికల్లో సివిల్ పోలీసులతోపాటు ఆర్‌పిఎఫ్, టిఎస్పీఎఫ్, హోం గార్డులు, మహిళా హోంగార్డులు ఉంటారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే ప్రజలు పోలీసులకు సహకరించాలి. హైదరాబాద్ ప్రజలు పోలీసులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రజలు పోలీసులతో సహకరిస్తారని భావిస్తున్నాం. ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూనే శాంతిభద్రతల పరిరక్షణకు ఉపక్రమించాలి. ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేలా పోలింగ్ అధికారులు, బూత్ ఏజెంట్లు పరస్పరం సహకరించుకోవాలి. ఎక్కడైనా ఏ చిన్నపాటి ఘర్షణ జరిగినా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఎన్నికల ప్రచారంలో అపరిచితుల పట్ల అప్రమత్తగా ఉండాలి. ఎవరిపైనైనా అనుమానం వచ్చినా.. గుర్తు తెలియని వస్తువులపైనా అనుమానం కలిగితే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలి. ప్రధానంగా ఎన్నికల్లో ఓటువేయడానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి. ఓటర్లు వారి వారి ఓటును స్వేచ్ఛగా వేసుకునేలా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

-ఎం మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్