ఫోకస్

పారదర్శకత లోపించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో పారదర్శకత, ప్రజాప్రతినిధులపై పట్టు లోపించిన కారణంగా అటు ప్రజాప్రతినిధులలో, ఇటు అధికారులలో అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. రాష్టస్థ్రాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే.. అదే దారిలో కిందిస్థాయి ప్రజాప్రతినిధుల, అధికారులు నడుస్తున్నారు. ఏ పని చేయాలన్నా కమీషన్ల కక్కుర్తి పెరిగిపోయిన కారణంగా అవినీతికి అంతులేకుండాపోతోంది. పేరుకు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా ప్రతిపనికీ కమిషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో కాకుండా ఉన్నంత కాలం సంపాదించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజాప్రతినిధులలో పక్షపాతం, దోపిడీ పెరిగిపోవటంతో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోంది. క్రియాశీలకంగా వ్యవహరించే ప్రతిపక్షాలను బెదిరించడం, అరెస్టులకు పాల్పడటం ద్వారా గొంతు నొక్కటం, అవకాశం ఉంటే పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సాహించటం వంటి సంఘటనలతో అధికార పక్షం అవినీతికి అడ్డు లేకుండా పోతోంది. ‘మీరు తినండి.. మాకూ ఇవ్వండి’ అనే పాలకుల వ్యవహారశైలివల్ల లంచం ఇస్తేనే పనులు జరుగుతాయనే వైఖరితో అధికారులు వ్యవహరిస్తున్నారు. అధికారుల పోస్టింగుల విషయంలో కూడా మునుపెన్నడు లేనివిధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. స్థాయికి తగినట్లు ప్రజాప్రతినిధులకు డబ్బు ముట్టచెబితేనే పోస్టింగులు లభిస్తున్నాయి. డబ్బులు ఇచ్చి పోస్టింగులు పొందుతున్న కారణంగా అన్నిస్థాయిల్లో అధికారుల అవినీతి మితిమీరిపోతోంది. ప్రజాసంక్షేమంకోసం కాకుండా ప్రజాకర్షణకోసం ప్రభుత్వం పథకాలు అమలుచేస్తుంటే ప్రజాప్రతినిధులు ఇందులో కూడా అవినీతికి, అక్రమాలకు పాల్పడుతుండటం శోచనీయం. పాలకులు ఎలా ఉంటే ప్రభుత్వ అధికారులు అలా ఉంటారనే విధంగా పరిపాలన కొనసాగుతోంది.
- దొంతి మాధవరెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్యే, నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా