ఫోకస్

స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంప్రతిపత్తిగల విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం చోటుచేసుకుంటోంది. రాజకీయ నాయకుల కనుసన్నల్లో విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి. పవిత్రంగా నడిచే విశ్వవిద్యాలయాలు నేడు స్వయంప్రతిపత్తిని కోల్పోతున్నాయి. గతంలో వైస్ చాన్సలర్లుగా గవర్నర్లుండే వారు. ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు, ఆధిపత్య పోరుతో విసిల నియామకాలు పాలకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. అందుకే విద్యార్థుల్లో వ్యతిరేకత, విశ్వవిదాయలయాల్లో అలజడులు నెలకొంటున్నాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూత్వ ఏజెండాతో ఆర్‌ఎస్‌ఎస్ భావాలు కలిగిన వారిని విసిలుగా నియమించి విశ్వవిద్యాలయాల్లో కులవివక్షను చూపుతోంది. ఇప్పటి వరకు విద్యాలయాలకే పరిమితంగా ఉన్న హిందూత్వ అజెండాను విశ్వవిద్యాలయాల వరకు వ్యాపింపచేసింది. దళితులంటే చులకనగా చూస్తున్నారు. దళిత, మైనార్టీలంటే సంఘవిద్రోహ శక్తులుగా పరిగణిస్తున్నారు. మానసికంగా ఒత్తిళ్లకు గురిచేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించే వరకే బాధ్యతలు తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దళిత, మైనార్టీ విద్యార్థులే ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వర్శిటీల్లో రాజకీయ జోక్యం ఉన్నంతవరకు విద్యార్థుల మధ్య కులవివక్ష కొనసాగుతూనే ఉంటుంది. దీంతో దళిత, మైనార్టీ విద్యార్థులు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టక తప్పడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వర్శిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించి విసిల నియామకాల బాధ్యతను వర్శిటీలకే ఇవ్వాలి.

- వెంకటేశ్ చౌహాన్ హెచ్‌సియూ విద్యార్థి జెఎసి కన్వీనర్