ఫోకస్

పిడివాదాలే అశాంతికి హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్ధి సంఘాలు అకడమిక్ కార్యకలాపాలు, విజ్ఞాన సముపార్జనకు సంబంధించిన అంశాలపై చర్చలు చేయాలి. ప్రజాస్వామిక వాదం బలపడాలంటే ఆధిపత్య ధోరణులను వదులుకోవాలి. సెంట్రల్ వర్శిటీలో చోటు చేసుకున్న సంఘటనను విశే్లషిస్తే, విద్యార్థి సంఘాల మధ్య నెలకొన్న ఆధిపత్య ధోరణులు, రాజకీయ పార్టీల ప్రమేయాలు కారణమని చెప్పవచ్చు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై అన్ని విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు, రాజకీయ పార్టీలు ఆత్మశోధన చేసుకోవాలి. అన్ని వర్శిటీలు కులాల కుంపట్లుగా మారాయి. విద్యార్థి సంఘాల అప్రజాస్వామిక కార్యకలాపాలను నియంత్రించే స్థితిలో లేకపోతే ఆ సంఘాలను నిషేధించడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. కాని ఇది అఖరి ప్రయత్నంగా మాత్రమే చేయాలి. విద్యార్ధి జీవితం కంటే ముఖ్యం మరేమి కాదు. సెంట్రల్ వర్శిటీలో ఏబివిపి, అంబేద్కర్ విద్యార్థి సంఘం మధ్య నెలకొన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారింది. మనం వర్శిటీలకు ఎందుకు వెళ్లాం? ఏమి సాధించేందుకు వెళ్లాం? రాజ్యాంగం ఇచ్చిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని వ్యక్తిగత అహంతో, న్యూనతా భావం లేదా ఆధిపత్య భావజాలం లేదా తామనుకున్న సిద్ధాంతమే గొప్పదనే పిడివాదాలకు విద్యార్ధి సంఘాలు బానిసకారాదు. రోహిత్ ఆత్మహత్య ఒక కనువిప్పుకావాలి. ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. అన్ని విశ్వవిద్యాలయాల్లో కులతత్వ ధోరణులను ప్రేరేపించే సంఘాలపై ఉక్కుపాదం మోపాలి. విద్యార్థి సంఘాల కార్యకలాపాల వల్ల ప్రజాస్వామ్యం వికసించాలి. మన వర్శిటీల నుంచే చాలామంది మేధావులు రాజకీయాల్లోకి వచ్చారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌కు తిరుపతి ఎస్వీ వర్శిటీలో మీటింగ్ పెడతానంటే అనుమతి ఇవ్వలేదు. అదే నారా లోకేష్ జన్మదిన వేడుకలకు కేక్ కోశారు. ఇవన్నీ విద్యార్ధి సంఘాల మధ్య ఉద్రిక్తతలను కలిగిస్తాయి. గుంటూరులో రిషితేశ్వరి ర్యాగింగ్ కేసు ఏమైంది? ఈ కేసులో బాధ్యులను శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- ఎస్ సల్మాన్ బాబు అధ్యక్షుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం