ఫోకస్

ఆత్మహత్యలొద్దు.. బతికి సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులెవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడరాదు. తద్వారా వారు సాధించేదేమీ ఉండదు. పైగా వారి కుటుంబ సభ్యులను అనాధలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో వ్యయ ప్రయాసాలతో పిల్లల్ని చదివిస్తున్నారు. అందువల్ల ఆత్మహత్య చేసుకోకుండా సమస్యపై గట్టిగా పోరాటం చేయాలి, బతికి సాధించాలి. ఇక వైస్-్ఛన్సలర్ల నియమాకం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అదే జరిగింది. బిజెపి ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు వత్తిడి కారణంగా, లేఖ రాయడం మూలంగా ఆ వర్సిటీ వైస్-్ఛన్సలర్ అప్పారావు ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అలా సస్పెండ్ చేయడంతో మొదట ప్రతిస్పందించింది మా ఎన్‌ఎస్‌యుఐనే. వర్సిటీ ఎన్‌ఎస్‌యుఐ విభాగం అధ్యక్షుడు లింగం తొలుత అభ్యంతరం తెలిపారు. దీనిని వర్సిటీ విసి సీరియస్‌గా తీసుకుని మిమ్మల్నీ టార్గెట్ చేస్తామంటూ బెదిరించారు. ఈ విషయం తెలిసిన వెంటనే నేనూ వర్సిటీకి వెళ్ళాను. అప్పటికి రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదు. నేను వెళ్ళాను కానీ ఎవరూ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత యూనివర్సిటీల్లో ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న వారిని వైస్-్ఛన్సలర్లను నియమిస్తున్నారు. దీంతో ఎబివిపి విద్యార్థులు రెచ్చిపోతున్నారు. రోహిత్ ఆత్మహత్య తర్వాతనైనా ప్రభుత్వం మేల్కొనలేదు. విసి అప్పారావును తప్పించినా మళ్ళీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావం ఉన్న వ్యక్తినే విసిగా నియమించింది. అసలు యూనివర్సిటీ విషయంలో రాజకీయ జోక్యం ఎందుకు? ‘మా ఎబివిపి విద్యార్థులపై దాడి జరిగింది’ అని పేర్కొనడం సమంజసమా? యూనివర్సిటీల వైస్-్ఛన్సలర్ల నియమాకం చేయడానికి ముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, రాజకీయాలకు సంబంధం లేనివారిని నియమించాలి.

- వెంకట్ బాలమూరి అధ్యక్షుడు, ఎన్‌ఎస్‌యుఐ తెలంగాణ శాఖ