ఫోకస్

మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తరువాత కుక్కలు చింపిన విస్తరిలా రూ. 16వేల కోట్ల ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వచ్చే సాధారణ ఎన్నికల్లో గతంలోకంటే మరింత అత్యధిక స్థానాలతో విజయదుందుభి మోగించి నాలుగోసారి పగ్గాలు చేపట్టడం ఖాయం. ఆరునూరైనా ఈ విజయాన్ని ఎవరైనా అడ్డుకోగలమని చెప్పుకుంటే అరచేతిలో సూర్యుడిని ఆపగలననే చెప్పుకోవటమే. గుజరాత్ ఎన్నికలు చూశారు. విపక్షాలు... అరాచకశక్తులు వివిధ కులాల సంఘాలు ఏకమయ్యాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీని బూతద్దంలో చూపి దుష్ప్రచారం చేశారు. తీరా ఏమైంది? అక్కడ బీజేపీ వరుసగా ఆరోసారి అధికారంలోకి వచ్చింది. ఇక ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు ఏనాడో కనుమరుగయ్యాయి. ప్రతిపక్ష వైకాపాకు శాసనసభలోకి అడుగిడే ధైర్యం లేకుండా పోయింది. పాదయాత్ర పేరిట కాలక్షేపం చేస్తే ఓట్లు రాలుతాయి అనుకోవటం భ్రమే. ఇక ప్రతిపక్ష నేత జనగ్‌కు వివిధ ఆర్థిక నేరాల్లో ఏ క్షణాన జైలుకు వెళతారో తెలియని స్థితి. ఈ దఫా బెయిళ్లు ఉండబోవు. శాశ్వత కారాగార శిక్షే ఖాయం. జాతీయ పార్టీ బీజేపీతో మా పార్టీ చెలిమి ఎంతో సఖ్యంగా కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీని కాదని మరో పార్టీని ప్రజలు ఆదరించే స్థితిలేదు.
- దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్ర జలవనరులశాఖ మాత్యులు