ఫోకస్

సస్పెన్షన్ పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలే తప్ప, చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉద్యోగులతో పాటు, విద్యార్థుల్లో క్రమశిక్షణ ఉండాలి. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిని సస్పెండ్ చేయడం, ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక విద్యార్థిని క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు అతడికి ఆ విషయం తెలియచేయాలి. రోహిత్ చురుకైనవాడు, తెలివైనవాడు అన్న విషయం అందరికీ తెలుసు. అలాంటి విద్యార్థిని సస్పెండ్ చేయడం తొందరపాటు చర్యే. నేను కూడా టీచర్‌గా పనిచేశాను. విద్యార్థులతో ఏ విధంగా ప్రవర్తించాలో, వారు ఏదైనా తప్పుచేస్తే ఎలా సరిదిద్దాలో తెలుసు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒక అంశంపై భిన్నాభిప్రాయాలు ఉండటంలో తప్పులేదు. ఒకరు చెప్పిన అంశమే సరైంది అన్న భావన ప్రజాస్వామ్య విధానంలో ఉపయోగపడదు. అమెరికాలోని బర్క్‌లీ పట్టణంలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇలాంటి పరిస్థితే ఉద్భవిస్తే యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆ సమస్యను సులువుగా పరిష్కరించారు. అయితే సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన కుల పంచాయితీకి దారితీసింది. విశ్వవిద్యాలయాల్లో కులాలకు, మతాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. కేవలం విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ పరిపాలనా విభాగాలు ఈ కోణంలోనే పనిచేయాలి. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. బోధనా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. పరిశోధనా విద్యార్థులకు గైడ్‌లు సరిపడినంత లేరు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఐదారుగురు విద్యార్థులకు ఒక గైడ్ ఉంటే మరికొన్ని విశ్వవిద్యాలయాల్లో 10-12 మంది విద్యార్థులకు ఒక గైడ్ ఉంటున్నారు. వాస్తవంగా ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులకు ఒక గైడ్ ఉండాలి. అప్పుడే పరిశోధన సక్రమంగా, చక్కగా జరుగుతుంది. మంచి పరిశోధనాత్మక నివేదికలు రూపొందుతాయి. అలాంటి నివేదికలు మన సమాజంలో మార్పులకు ఉపయోగపడతాయి. పరిశోధన చేసే విద్యార్థులకు నిరంతరం సలహాలు సూచనలు లభించాలంటే ప్రొఫెసర్ల సంఖ్య తగినంత ఉండాలి. అందుకే యూనివర్సిటీలు బోధనా సిబ్బందిని అవసరమైన మేరకు నియమించుకోవాలి. ఎంతమంది విద్యార్థుల పరిశోధన చేస్తున్నారో ఆ సంఖ్యను బట్టి వారికి అనుగుణంగా గైడ్‌లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.

- చుక్కా రామయ్య విద్యావేత్త