ఫోకస్

స్మార్ట్‌సిటీలు ఓ భ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ సిటీల నిర్మాణం అనేది ఒక భ్రమ. అది రంగుల ప్రపంచాన్ని చూపించడమే అవుతుంది. అసలు వౌలిక సదుపాయాలైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనికేషన్, శానిటేషన్, వీధిదీపాలు వంటివి సక్రమంగా లేని పట్టణాలు, ద్వితీయ స్థాయి నగరాలు చాలా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్న స్మార్ట్ సిటీలు, వాటిలో గృహనిర్మాణం వంటి వాటికి ప్రాతిపదిక ఏమిటనేది సరిగ్గా చెప్పడం లేదు. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) పద్దతిలో చేపట్టడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు వ్యవస్థను అప్పగించడమే అవుతుంది. ప్రభుత్వ కనీస బాధ్యతలైన వౌలిక సదుపాయాల కల్పన చేపట్టకుండా వదిలించుకునే ప్రయత్నం చేస్తోంది. స్మార్ట్‌సిటీలు అనే దానికి తాము వ్యతిరేకం కాదు, చెప్పినట్లు జరిగితే అంతా మంచిదే. కానీ ఈ రకమైన ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి పొందడం, ప్రజలకు రంగుల ప్రపంచం చూపిస్తే చాలా తప్పు. జిడిపిలో 60 శాతం పట్టణాల నుంచి వస్తుంటే, అలాగే జనాభా కూడా 31 శాతం పట్టణాల్లోనే ఉన్నారు. విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ, వలసలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. గతంలో కూడా జెఎన్‌యుఆర్‌ఎం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అసలు ఆ పథకం ఏమైంది? ఇప్పుడు ఉందో లేదా కూడా తెలీదు. ఇప్పుడు మళ్లీ అమృత్‌నగరాలని, స్వచ్ఛ్భారత్, స్మార్ట్ సిటీలు అంటూ రోజుకో రకమైన ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారు. ప్రతి స్మార్ట్ సిటీకి రూ.500 కోట్లు అంటున్నారు. దానిలో దశలవారీగా 100, 200 కోట్లు కేటాయిస్తున్నారు. స్మార్ట్ సిటీలుగా కొన్నింటిని అభివృద్ధి చేస్తే మిగిలిన పట్టణాల్లో వౌలిక సదుపాయాల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం ప్రజలకు వౌలిక సదుపాయాల కల్పన బాధ్యత కలిగి ఉండాలనేది రాజ్యాంగం చెబుతున్న సూత్రం. దానికి విరుద్ధంగా ప్రభుత్వం పిపిపి అంటూ ప్రచారం చేస్తున్నారు. 2014లో ఐక్యరాజ్య సమితి (యుఎన్‌ఓ) పట్టణీకరణ అంశంపై ఇచ్చిన నివేదికలో ప్రణాళిక లేని పట్టణీకరణ సరికాదని, విజయవంతం కాలేదని వెల్లడించింది. అటువంటి నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేస్తే మంచిది. పట్టణాల్లో ఎంతోమంది పేదలు నివశిస్తున్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించడంతోపాటు స్మార్ట్‌సిటీల నిర్మాణాన్ని కేంద్రం బాధ్యతాయుతంగా చేపడితే మంచిదే.
- వై.వి.రావు, సిపిఎం, ఎపి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు