ఫోకస్

టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు తరహాలో రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పరాభవం తప్పదు. తమిళనాడులో తాజాగా జరిగిన ఉప ఎన్నికలో ఓటర్లు ఇచ్చిన తీర్పు దేశంలో అందరినీ ఆలోచింపజేసేలా ఉంది. అధికారమదంతో ఉండేవారికి ఓ గుణపాఠం లాంటి తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే పాలనతో ప్రజలు విసుగు చెందారు. అదేవిధంగా తెలంగాణలో కుటుంబ పాలనతో ప్రజలు బేజారెత్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అవకాశవాద రాజకీయాలతో ఎల్లకాలం లబ్ధి పొందలేరు. గంగ-జమునా తైజీబ్ ఉన్న తెలంగాణలో కుట్రలు, కుతంత్రాలు, అవకాశవాద రాజకీయాలకు తావులేదు. తమిళనాడు ఉప ఎన్నికల ఫలితం తరహాలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి ప్రణాళికను పక్కనపెట్టి దేశవ్యాప్తంగా బిజెపి జెండాను రెపరెపలాడించాలన్న ప్రణాళికతో ముందుకెళుతున్నారని ప్రజలు గ్రహించారు. రాజ్యాంగాన్ని, సీబీఐని ఇలా వ్యవస్థలను కుప్పకూల్చి అధికారాన్ని చెలాయిస్తున్నారు. ధరలు తగ్గించడంలో ప్రధాని విఫలమయ్యారు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గినా, దేశంలో పెట్రోలు, డీజిలు ధరలు ఎందుకు తగ్గడం లేదు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకుని వచ్చి పేదల అకౌంట్లలో వేస్తామన్న హామీ ఏమైంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు. నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? నేషనల్ మెడికల్ కమిషన్ తేలేదు, జీడీపీ పెరగలేదు, రైతుల జీవితాలు బాగుపడలేదు, కొత్తగా పరిశ్రమలు రాలేదు. ఇలా అన్ని రంగాల్లో విఫలమై, ఇచ్చిన హామీలు అమలు చేయలేక మోదీ ప్రభుత్వం చతికిలబడింది. ప్రధాని మోదీ మాత్రం విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కొత్త హామీలతో, అవకాశవాద రాజకీయాలతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరు.
- డాక్టర్ శ్రవణ్ దాసోజు ముఖ్య అధికార ప్రతినిధి, టీ.పీసీసీ