ఫోకస్

ఎందుకీ వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ సిటీల ఆలోచన మంచిదే. కానీ అన్ని నగరాలను ఒకే గాటున కట్టే విధానం సరైనది కాదు. ఢిల్లీ జనాభా ఐదు కోట్లు, కాకినాడ జనాభా ఎనిమిది లక్షలు. స్మార్ట్‌సిటీల పేరుతో ఈ రెండు నగరాలను ఒకే గాటున కట్టి చూడడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయం ఐదువేల కోట్ల రూపాయలు. స్మార్ట్‌సిటీల పేరుతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కాకినాడ అన్ని నగరాలకు ఒకే విధంగా వంద కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల ఏ రకంగానూ సహేతుకంగా ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొనే స్మార్ట్‌సిటీ విధానం మార్చాలని కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. స్మార్ట్‌సిటీలను మూడు కేటగిరిలుగా మార్చి, నగర ఆదాయం, జనాభా ప్రకారం ఈ కేటగిరిల్లో చేర్చాలి. స్మార్ట్‌సిటీ పేరుతో హైదరాబాద్‌కు వంద కోట్లు కేటాయిస్తే ఏ రకంగానూ సరిపోదని కేంద్రం దృష్టికి తీసుకు వచ్చాం. హైదరాబాద్‌కు బదులు కరీంనగర్‌ను చేర్చమని కోరాం. అయితే బిజెపి ఎందుకో మొదటి నుంచి తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. తెలంగాణలో ఒక్క నగరం కూడా స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చలేదు. పైగా ఒక్క మార్కుతో వరంగల్ అవకాశం కోల్పోయిందని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి కేంద్రం తెలంగాణపై ఇదే విధంగా వివక్ష చూపుతోంది. ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇళ్లను కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం తొలుత నామ మాత్రంగా పదివేల ఇళ్లను కేటాయించింది. అసంతృప్తి వ్యక్తం చేసి నిలదీసిన తరువాత కొంత పెంచారు. తెలంగాణ ఏర్పడగానే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడులు కలిసి ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలను ఆంధ్రలో కలిపారు. బిజెపి- టిడిపి కూటమి తెలంగాణకు మొదటి నుంచి ఏ విధంగా అన్యాయం చేస్తుందో మేం ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేంద్రం వివక్షపైనే మేం ప్రధానంగా ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాం. తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతున్న బిజెపిని ఎందుకు ఆదరించాలని ప్రశ్నించాం. ఇతర రాష్ట్రాలను ఏ విధంగా చూస్తున్నారో తెలంగాణకు సైతం అదే విధంగా న్యాయంగా నిధులు, పథకాలు మంజూరు చేయాలి. తెలంగాణ ఏర్పడినప్పుటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగు పెట్టలేదు, మరి బిజెపి నాయకులు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ఓట్లు అడుగుతారని ప్రశ్నించాం. ఇప్పటికైనా కేంద్రం వివక్ష చూపడం మాని దేశంలోని అన్ని రాష్ట్రాలను సమంగా చూడాలి. స్మార్ట్‌సిటీ పథకంలో అన్ని నగరాలను ఒకే గాటున పెట్టకుండా కేటగిరిలుగా విభజించి పెద్ద నగరాలను ఇతర నగరాలను వేరువేరుగా చూడాలి.

-కె.తారక రామారావు ఐటి శాఖ మంత్రి