Others

‘సుందరబన్’ విశేషాలు ఇవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఏకమొత్తంగా (ఒకేబెల్ట్) ఉండే ఏకైక, అతిపెద్ద మాంగ్రూవ్ అడవుల (మడ) సమూహం సుందర్‌బన్. బంగ్లాదేశ్, భారత్ (వెస్ట్‌బెంగాల్) పరిథిలో పదివేల చ.కి. మేరకు విస్తరించింది. ఇందులో 81శాతం బంగ్లాదేశ్ పరిథిలోను, 19 శాతం భారత్ పరిథిలోనూ ఉంది.
భారత్‌లోని వెస్ట్‌బెంగాల్ 24 పరగణాల జిల్లాలో దాదాపు 2వేల ఎకరాల్లో ఈ సుందర్‌బన్ మడ అడవులున్నాయి. మొత్తం 102 దీవులతో గంగ, మేఘ్న, బ్రహ్మపుత్ర నదులు, బంగాళాఖాతం తీరంలో కలుస్తూన్న డెల్టా ప్రాంతం ఇది. సారవంతమైన, జీవవైవిధ్యంతో కూడిన ఈ అడవులు ఇటీవల క్షీణిస్తున్నాయి. భూతాపం పెరగడంతో సముద్రనీటిమట్టం పెరుగుతూండటంతో ఇవి ముంపునకు గురవుతుండటం వీటిపై ఆధారపడిన జీవజాతులకు ముప్పు ఏర్పడుతోంది.
కనీసం 300 సంవత్సరాల నుంచి సుందర్‌బన్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంది. 1997లో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించింది.
ప్రపంచంలోనే అరుదైన, నీటితోకూడిన అడవుల్లోనూ సంచరించి, జీవించగల బెంగాల్ టైగర్‌లు ఉండేది ఇక్కడే. గేంజిటిక్ డాల్ఫిన్లు సహా ఎన్నో ప్రత్యేక జీవజాతుల కేంద్రం ఇది.
పెద్దపెద్ద అలలు, బురదతోకూడిన నీరు, వరదలు, సముద్ర జలాలు చొచ్చుకురావడం సుందర్‌బన్‌లోని ప్రజలకు కష్టాలు తెస్తూంటాయి.
భారత్ పరిథిలోని సుందర్‌బన్ పరిథిలో దాదాపు 40 లక్షలమంది జీవిస్తున్నారు. వారిలో 1.4 లక్షలమంది ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు. మొత్తం 102 దీవుల్లో 52వరకు భారత్ పరిథిలో ఉన్నాయి.
విచ్చలవిడి వేట, చెట్ల నరికివేత, బంగ్లాదేశ్‌లో బొగ్గుతో నడిచే విద్యుత్‌ప్లాంట్లు, కాలుష్యం సుందరబన్‌కు చేటుతెస్తున్న అంశాలు. మరపడవులు, స్టీమర్ల రాకపోకలు, సుందరవనాలకు చేరువులో హోటళ్లు, రెస్టారెంట్లు, లాడ్జీల నిర్వహణకు పరిమితులు విధిస్తూ నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ హెచ్చరికలు కొంత ఫలితాలిస్తున్నాయి.