కడప

రూ. కోటివిలువైన ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాజీపేట, ఏప్రిల్ 12: ఖాజీపేట అటవీ ప్రాంతం నుంచి తరలిస్తున్న ఎర్రచందనాన్ని మంగళవారం ఫారెస్టు సెక్షన్ అధికారి గుర్రప్ప ఆధ్వర్యంలో పట్టుకున్నారు. దాడుల్లో కోటిరూపాయల చేసే 50ఎర్రచందనం దుంగలు, 10 టైర్ల లారీ , మరో ఆల్విన్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకమల అడవుల నుంచి చిత్తూరు మీదుగా రెండు వాహనాలు వస్తున్నాయని సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ అధికారి గుర్రప్ప, ఎఫ్‌డిఓ హసన్‌బాషా, ఏబిఓలు రమేష్, చాన్‌బాషాలు దాడులు చేయగా మైదుకూరు వైపు రెండు వాహనాలు దూసుకెళ్లడంతో వెంబడించారు. భూమాయపల్లె వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని వాహనం ఆగిపోవడంతో పట్టుకున్నారు. తమిళనాడు రాష్ట్ర సేలం జిల్లాకు చెందిన గణేష్, రమేష్, సెల్వమ్, తాతాఖన్ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కెఏ 01ఏఏ 9955 అనే 10టైర్ల లారీ, ఏపి 02 డబ్ల్యు 9768 నెంబర్ గల ఆల్విన్‌ను అదుపులోకి తీసుకుని పరిశీలించగా అందులో 50 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. ఫారెస్టు డిఎఫ్‌ఓ శివశంకర్, ఎఫ్‌ఆర్‌ఓ ప్రియాంకారెడ్డి ఆదేశాల మేరకే ఈ దాడులు నిర్వహించారు.