కడప

జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, సెప్టెంబర్ 23: జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర జ్వరాలు ప్రబలుతున్న నేపత్యంలో కలెక్టర్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు అన్నారు. రాయచోటి పీపీ యూనిట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో జనవరి నుండి జ్వరబాధితుల నుండి 3,09,264 మందికి రక్తనమూనాలను సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో మలేరియా నిర్ధారణ కేసులు 589 నమోదయ్యాయని, ఈ నెల 19 నుండి ఐదు రోజులుగా రాయచోటి పట్టణంలో డెంగ్యూ, మలేరియా ప్రత్యేక సంచార బృందం స్థానిక పీపీ యూనిట్ సిబ్బందితో కలిసి దోమల లార్వా సర్వే, జ్వరాల సర్వే కోసం 6,396 గృహాలు సందర్శించినట్లు తెలిపారు. జ్వరబాధితుల నుండి 84 రక్తపూత నమూనాలు సేకరించినట్లు మలేరియా నిర్ధారణ కేసు ఒకటిగా నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దోమలపై దండయాత్రను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, మెప్మా సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీహెచ్‌వో వెంకటనారాయణ, సబ్‌యూనిట్ ఆఫీసర్ జయచంద్రుడు, ఎంపీహెచ్ ఎస్ శ్రీనివాసులరెడ్డి, చంద్రకళ, హెల్త్ అసిస్టెంట్లు విశ్వనాథరెడ్డి, గంగాధర్, హెచ్‌ఈ మైనకమ్మ తదితరులు పాల్గొన్నారు.