కడప

రైతు బజారులో ఉల్లిగడ్డలు అమ్ముకోవచ్చు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 23: రైతులు తమ ఉల్లి పంటను రైతు బజారులో అమ్ముకోవచ్చని మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉల్లిసాగు విస్తీర్ణం 1765 హెక్టార్లలో సాగుచేయడంతోపాటు పొరుగు రాష్టమ్రైన మహారాష్ట్ర, పొరుగు జిల్లా కర్నూలు జిల్లా నుంచి అధికమొత్తంలో ఉల్లి దిగుమతి అవుతోందని అందువల్ల కడప జిల్లాలో ఉల్లిరైతులకు డిమాండ్ లేకపోవడంతో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గాయని ఉల్లి రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే మొదటి రకం రూ.8లు, రెండవ రకం రూ.7లు, మూడవ రకం రూ.6లుతో రైతుల పొలాల వద్దే కొనుగోలుచేసి రైతు బజారులో అమ్ముకునేందుకు సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే రైతులే సొంతంగా రైతు బజారుకు తెచ్చుకుని అమ్ముకునే వెసులుబాటును కూడా కల్పించామని మార్కెటింగ్ సంచాలకులు బి.శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 24వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు. ఈవిషయాన్ని రైతులు, ప్రజలు గమనించాలని కోరారు.