కడప

గండికోటకు ఆరు టిఎంసిల నీరు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్లిమర్రి,సెప్టెంబర్ 23: కృష్ణాజలాలపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు మధ్య వాగ్వివాదం జరుగుతున్న సందర్భంగా ఆంధ్రరాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా నికరజలాల వాటాను తేల్చాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం పెండ్లిమర్రిలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరవులో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాలకు కృష్ణానికర జలాలను ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 121 టిఎంసిలు వచ్చేలా ఏర్పాటుచేశారని, ఆ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే పోతిరెడ్డిపాడు నుంచి గాలేరు-నగరి ప్రాజెక్టుకు నీరు చేరక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. గాలేరు-నగరి నుంచి పోతిరెడ్డిపాడు వరకు కాలువల నిర్మాణం అస్తవ్యస్థంగా ఉందని నిర్మాణ పనులు ఎప్పుడు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని హామీలు ఇస్తున్నారే తప్ప నీరు అందించేందుకు తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. రాయలసీమలోని కడప జిల్లాపై ముఖ్యమంత్రికి అభివృద్ధిపై కానీ, సాగునీరు అందించడంపై కానీ సవతి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం వెనుకబడిన జిల్లాలకోసం ప్రతి ఏడాది రూ.50కోట్లు నిధులు ఇస్తున్నా వాటిని రాష్ట్రప్రభుత్వం సొంత అవసరాలైన ఫర్నీచర్, పుష్కరాలు తదితర వాటికి నిధులు మళ్లిస్తూ వాడుకుంటున్నారే తప్ప వెనుకబడిన జిల్లాలకు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. పోలవరం నుంచి రాయలసీమకు నీరు మళ్లించడం కోసం చట్టబద్దత కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి కోస్తాప్రాంతానికి చేస్తున్న అభివృద్ధి రాయలసీమ ప్రాంతానికి చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆయన రాయలసీమలో పుట్టినా రాయలసీమకే అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. గత రెండుసంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కడప జిల్లా గండికోటలో బస చేసి అభివృద్ధిపై అనేక వరాల జల్లులు కురిపించారే కానీ ఇంతవరకు గండికోట అభివృద్ధిపై శ్రద్ధ చూపడంలేదని విమర్శించారు. గండికోటకు 6 టిఎంసిల నీటిని ఖచ్చితంగా విడుదల చేయాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా బిజెపి తరపున ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్రంలో నీరు-చెట్టు కార్యక్రమం వల్ల టిడిపి నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది కానీ ప్రజలకు మేలు జరగడం లేదన్నారు. నీరు-చెట్టుకు కేటాయించిన నిధులను చెక్ డ్యామ్‌ల ఏర్పాటుకు కేటాయిస్తే కొంతమేలైనా ప్రజలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రమణారెడ్డి, కార్యకర్తలు జనార్థన్, చెన్నకేశవ, నాయకులు పాల్గొన్నారు.