కడప

యోగివేమన వైస్ చాన్సలర్‌గా రామచంద్రారెడ్డి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 7: గత మూడు మాసాలుగా ఖాళీగా ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ప్రొఫెసర్ ఏ.రామచంద్రారెడ్డిని ప్రభుత్వం నియామకం చేసి గవర్నర్ నరసింహన్‌కు పంపడం, ఆయన ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. ఈయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వృక్ష సైన్స్ విభాగానికి అధిపతిగా ఉంటూ, నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించి, ఎస్వీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు సన్నిహితమైనందున ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఈయన కిరణజన్మసంయోగంపై సుదీర్ఘంగా పరిశోధనలు చేసి దేశస్థాయిలోనే పేరు గడించారు. ప్రస్తుతం బయోడీజిల్, భూ వాతావరణంపై పరిశోధనలు జరుపుతున్నారు. జిల్లాలో అత్యధికంగా ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండటం, రాజకీయ నాయకులకు విద్యాసంస్థలు ఉండటంతో వారి వత్తిళ్లు ఎదుర్కోవడానికి అత్యంత అనుభవం కలిగిన రామచంద్రారెడ్డిని ఏరికోరి నియామకం చేయడం, సర్చ్ కమిటీ ఆమోదం తెలపడం, గవర్నర్ వద్దకు దస్త్రం చేరింది. యుజిసి ప్రభుత్వ నిబంధనల మేరకు రామచంద్రారెడ్డి అర్హుడు. వైస్ చాన్సలర్‌గా నియామకం కోసం డజను సంఖ్యలో క్యూకట్టి రాజకీయ పైరవీలు కూడా చేసినట్లు తెలుస్తోంది. మూడు మాసాల క్రితం విసిగా పనిచేసిన ప్రొఫెసర్ భేతనభట్ల శ్యాంసుందర్ అనేక రాజకీయ వత్తిళ్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కృష్ణదేవరాయ విశ్వవిద్యాలం విసిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజగోపాల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయానికి పాలక మండలి ఏర్పాటై నాలుగుమాసాలైన ఇంతవరకు విసి నియామకం జరగలేదు. మొత్తం మీద విసిగా రామచంద్రారెడ్డి నియామకంతో కథ సుఖాంతమైంది.