కడప

మైలవరం ప్రాజెక్టుకు నీటిని కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 15: వేలాదికోట్లరూపాయలతో నిర్మించిన గండికోట ప్రాజెక్టుతో దశాబ్దాల క్రితం నిర్మించిన మైలవరం ప్రాజెక్టుకు నీటి సరఫరాకు గండిపడనుంది. గండికోట ప్రాజెక్టునిర్మాణం దశ పూర్తవుతున్న తరుణంలో 10 టిఎంసిల సామర్థ్యంతో తాత్కాలికంగా నీరు నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 1973లో మైలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 10 టిఎంసిల నీటి నిల్వకు అప్పట్లో ప్రభుత్వం, అధికారులు నిర్ణయించారు. అయితే 4.7 టిఎంసిల నీటికే పరిమితం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ,అధికారులు గండికోట ప్రాజెక్టుపైనే దృష్టికేంద్రీకరించడంతో మైలవరానికి రావాల్సిన నీరు కూడా దక్కడం లేదు. ఇటీవల అధికారులు కేవలం వెయ్యిక్యూసెక్కుల నీటినే విడతల వారీగా వదులుతున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో సాగునీరుకు మైలవరంపైనే ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం నీరు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నీరు జిల్లాకు వదలగా మైలవరం ప్రాజెక్టుకు నీరును అంతంతమాత్రమే కేటాయించారు. మైలవరం ప్రాజెక్టుకు శ్రీశైలం కర్నూలు జిల్లా ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీరు వదలాల్సివుంది. ప్రస్తుతం ఆ నీరు గండికోట ప్రాజెక్టుకు లింగాపురం కనె్నలవాగు నుంచి వదులుతున్నారు. గతంలో అనంతపురం జిల్లాలోని పెన్నా, చిత్రావతి నదుల ద్వారా మైలవరానికి నీరు చేరేది. చిత్రావతి , పెన్నా నదులు ప్రవహించకపోవడంతో మైలవరానికి పూర్తిగా నీరు వదలడం లేదు. అలాగే తుంగభద్ర నుంచి చుక్కనీరు రాదని గండికోటకు కృష్ణాజలాలు కేటాయించి తద్వారా మైలవరం ప్రాజెక్టుకు కూడా నీరు అందిస్తామని అధికారులు ప్రకటించారు. మైలవరం ప్రాజెక్టు ఉత్తర దక్షిణ కాలువల ద్వారా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, టిటిడబ్ల్యులకు వంద గ్రామాలకు తాగునీరు అందించేవారు. ఇక సాగునీరు విషయానికొస్తే కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజవర్గాల్లో 75వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సివుంది. ప్రస్తుతం మైలవరం ప్రాజెక్టును గండికోట అంతర్భాగం చేయడంతో గండికోటకు నీరు రావడమే గగనంగా ఉంటే మైలవరం ప్రాజెక్టుకు నీరు రావడం ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద మైలవరం ప్రాజెక్టుకు గండికోట ప్రాజెక్టుతో సాగునీరు, తాగునీటికి మైలవరానికి గండిపడిందని చెప్పవచ్చు.