కడప

నేడు మంత్రులు గంటా, కామినేని రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 7: జిల్లాకు మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్యవిద్య, ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసులు జిల్లాకు రానున్నారు. వారిరువురూ ఉదయం 8గంటలకు కడపలో శక్తిప్రైవేట్ డయాగ్నస్టిక్ లేబొరేటరీని ప్రారంభిస్తారు. అనంతరం వారు ప్రొద్దుటూరుకు వెళ్లి 11 గంటలకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. కడప రిమ్స్‌కు ధీటుగా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరుస్తూ మూత్రపిండ వ్యాధిగ్రస్తులు అధికం కావడంతో వారిని సంరక్షించేందుకు అక్కడ డయాలసిస్ కేంద్రాన్నిప్రారంభిస్తున్నారు. జిల్లా కేంద్రమైన రిమ్స్‌లో 18 యూనిట్లతో డయాలసిస్ కేంద్రం ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా మూత్ర పిండాల వ్యాధిగ్రస్తులు రిమ్స్‌కు వచ్చేందుకు వ్యయప్రయాసాలు పడుతున్నారు. ఈతరుణంలో ప్రొద్దుటూరులో డయాలసిస్ యూనిట్‌ను ప్రభుత్వం మంజూరుచేసి అందుకు కావాల్సిన అన్ని పరికరాలు విడుదల చేయడంతో వాటిని లాంఛనంగా మంగళవారం మంత్రులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

40 లక్షల ఎర్రచందనం వృక్షాలు
నరికేశారు..

రైల్వేకోడూరు, నవంబర్ 7: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం వృక్షాలు ఒక్క రాయలసీమలోనే ఉన్నాయని, ఇందులో కూడా అత్యధిక భాగం కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని శేషాచలం అడవులలో సుమారు 40 లక్షల ఎర్రచందనం వృక్షాలను ఇప్పటివరకు స్మగ్లర్లు అక్రమంగా నరికి తరలించడం జరిగిందని టాస్క్ఫోర్స్ డిఐజి డాక్టర్ మాగంటి కాంతారావు వెల్లడించారు. సోమవారం స్థానిక టాస్క్ఫోర్స్ డిఐజి కార్యాలయం ఆవరణలో అడవుల సంరక్షణ-మానవాళి మనుగడ అనే అంశంపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హజరైన డిఐజి మాట్లాడుతూ 1.20 కోట్ల ఎర్రచందనం వృక్షాలు శేషాచలం అటవీ ప్రాంతంలో గతంలో నిర్వహించిన సర్వేల ద్వారా వెల్లడి అయిందన్నారు. గడిచిన 20 సంవత్సరాలుగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు, ఎర్రకూలీలు కలసి సుమారు 40 లక్షల మొక్కలను నరికేశారని, ఇంకా 80 లక్షల వృక్షాలు ఉన్నాయని, వాటి సంరక్షణ అటవీ, పోలీస్, టాస్క్ఫోర్స్ అధికారులు, వారి సిబ్బందిపై ఉందన్నారు. శేషాచలం అడవులలో తమిళకూలీలు టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీ సిబ్బందిపై రాళ్లతో కత్తులతో తెగబడిన సందర్భాల్లో ఏడు సార్లు జరిపిన కాల్పులలో 30 మంది కూలీలు మృతి చెందారన్నారు. సంఘటనలు జరుగుతున్నా కూలీలు ఆదాయం కోసం తిరిగి శేషాచలం అటవీ ప్రాంతానికి రావడం బాధాకరమన్నారు. కాగా ఎర్రచందనం కూలీల చేతిలో ఇద్దరు అటవీ అధికారులు మృత్యువాత పడగా, మరి కొంతమంది గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారన్నారు. ఇటీవల కాలంలో బాలుపల్లె అటవీ పరిధిలో హనుమంతునాయక్ అనే కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడని, వారి కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అడవులు అంతరించిపోతే మానవాళికి ప్రమాదం తప్పదన్నారు. ఇందులో భాగంగా ఇటీవల అటవీ గ్రామాలపైకి అడవి జంతువులు వస్తున్నాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ సాధ్యపడుతుందన్నారు. ఇందులో భాగంగా రాయలసీమలోని అటవీ సమీప గ్రామాల్లో అటవీ సంరక్షణపై లఘ చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం రాత్రి రాజంపేట అటవీప్రాంతంలో అడవిబాట కార్యక్రమంలో భాగంగా బస చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అధికారుల భాగస్వామ్యం అనే అంశంపై లఘ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో రాజంపేట డిఎస్పీ ఎ.రాజేంద్ర, టాస్క్ఫోర్స్ డిఎస్పీ మహేశ్వరరాజు, హరినాధబాబు, శ్రీ్ధర్, సిఐలు ఆలీబాషా, శ్రీనివాసరావు, ఎఫ్‌ఆర్వో వెంకటరమణారెడ్డి, స్థానిక ఎస్సైలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఫలాలు అందరికీ
అందించేందుకే జన చైతన్యయాత్రలు

వీరబల్లి, నవంబర్ 7: మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో జన చైతన్యయాత్రలు నిర్వహిస్తున్నట్లు విప్ మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని పెద్దివీడు, మట్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిజమైన లబ్దిదారులకు అందే విధంగా యాత్రల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హత గల లబ్దిదారులు స్థానిక టిడిపి నాయకులతో చర్చించి తమకు కావాల్సిన పథకాల ద్వారా అభివృద్ధి సాధించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కష్టపడుతున్నారన్నారు. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రుణమాఫీ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి తదితర పథకాలను నిరుపేదలను అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మండల స్థాయి, గ్రామస్థాయి అధికారులు ఈ విషయాలను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరించి లబ్ధిపొందేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సిమెంట్ రోడ్లు, తాగునీరు తదితర సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి ఎ.సాయిప్రతాప్, ఎంపిపి ఎస్.స్వప్న, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, సురేంద్రారెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, మండల నాయకులు రామకృష్ణంరాజు, యువనాయకులు వీరనాగిరెడ్డి, తహశిల్దార్ నారాయణరెడ్డి, ఎంపిడివో జనార్దనరావు, టిడిపి కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.