కడప

అన్నమయ్య రహదారి కోసం అలుపెరుగని పోరాటం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 2: వేంకటేశ్వరునిపై 32వేల సంకీర్తనార్చన చేసిన తొలి వాగ్గేయదారుడు, ద్రావిడాగమ సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి కోసం జిల్లా వైకాపా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాధరెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఈ ఏడాది 14వ మారు అన్నమయ్య తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గంలో వేలాదిమంది గోవిందమాలలు ధరించిన భక్తులతో మహాపాదయాత్ర ఈనెల 10వ తేదీ నిర్వహించేందుకు అమర్‌నాధరెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేణిగుంట-రైల్వేకోడూరు మార్గమధ్యంలో కుక్కలదొడ్డి నుండి తిరుమలకు అన్నమాచార్యులు నడిచివెళ్ళేవారు. ఈ మార్గం గుండా వెళితే తిరుమలకు అతి తక్కువ దూరం కూడా. ఈ మార్గాన్ని అభివృద్ధిపరచాలని కోరుతూ 14ఏళ్ల ముందు అమర్‌నాథరెడ్డి గోవిందమాల ధరించి తనతోపాటు వేలాదిమందికి గోవిందమాలలు ధరించి తన సొంత గ్రామం రాజంపేట మండలం ఆకేపాడు ఆలయాల సముదాయం నుండి తిరుమలకు నడిచి వెళ్లే మహాపాదయాత్ర కార్యక్రమాన్ని మొదలెత్తారు. అప్పటి నుండి ఈఏడాది వరకు ప్రతియేడు ఈ మార్గంలో తిరుమలకు మహాపాదయాత్ర వేలాది గోవిందమాలలు ధరించిన భక్తులతో చేపట్టడమే కాకుండా, తనతోపాటు మహాపాదయాత్రలో పాల్గొనే భక్తులకు మూడు రోజులపాటు వసతి, భోజన సదుపాయాలు, తిరుమలతో వేంకటేశ్వరస్వామి దర్శన ఏర్పాట్లుచేస్తూ వస్తున్నారు. అత్యంత క్లిష్టమైన ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓర్పుతో అమర్‌నాథరెడ్డి నిర్వహిస్తూ వస్తుండడం జరుగుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నమయ్య తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అమర్‌నాథరెడ్డి సీఎం ద్వారా చేసిన కృషి అప్పట్లో ఫలించేటట్టుగానే కనిపించింది. అయితే కారణాలు ఏమైనా ఈ మార్గం అభివృద్ధి పనులు ముందుకు సాగలేదు. అప్పట్లో అమర్‌నాథరెడ్డి విజ్ఞప్తిమేరకు సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన మార్గం అభివృద్ధి చేసేందుకు వీలుగా సర్వేచేసి నివేదికలు అందజేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీచేయడం జరిగింది. దీంతో అన్నమయ్య తిరుమల మార్గం అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. అయితే సర్వేతోనే ఈ మార్గం అభివృద్ధి పనులు మూలపడ్డాయి. అటవీ జంతువులను సాకుగా చూపుతూ ఈ మార్గం అభివృద్ధి ముందుకు సాగకుండా కొన్ని రాజకీయశక్తులు పనిచేశాయన్న ఆరోపణలున్నాయి. ఈ మార్గం అభివృద్ధి పరచడం చిత్తూరుజిల్లా వాసులకు ఇష్టం లేదు. కారణం అన్నమయ్య నడిచి వెళ్ళిన మార్గంలో తిరుమలకు రహదారి వసతి ఏర్పడితే మహారాష్ట్ర, హైదరాబాద్, కర్నూల్, రాజంపేటలతోపాటు విజయవాడ, నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల నుండి తిరుమలకు చేరుకోవాలనుకునే భక్తులకు అన్నమయ్య మార్గం గుండానే ప్రయాణించే పరిస్థితులున్నాయి. ఎందుకంటే ఈ మార్గం అలిపిరి మీదుగా వెళ్ళేకంటే తిరుమలకు చాలాతక్కువ దూరమవుతొంది. ప్రయాణభారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తిరుమల కొండపైకి చేరుకునేందుకు మలుపులు, ఎత్తుకూడా తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే కడపజిల్లా పరిధిలో ఉన్న కుక్కలదొడ్డి, మామండూరు ఊహలకందని విధంగా అభివృద్ధిచెందే పరిస్థితులు ఏర్పడతాయి. తద్వారా తిరుపతి అభివృద్ధి కుంటుపడే పరిస్థితులున్నాయి. అందువల్ల చిత్తూరు జిల్లావాసులు అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన మార్గం అభివృద్ధిచేసే అంశంలో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం చేయడం సహజం. దీంతో వేంకటేశ్వరుని ప్రియభక్తుడైన అన్నమాచార్యుల తిరుమల కాలిబాట అభివృద్ధి ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నచందంగా పడి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అన్నమయ్య కాలిబాటను అభివృద్ధిపరిచే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటూ అమర్‌నాధరెడ్డి కృషి చేసుకుంటూ వస్తున్నారు. అయితే జిల్లా వాసులు అమర్‌నాథరెడ్డికి సరైన దిశలో పార్టీలకతీతంగా మద్దతుఇచ్చి పోరాడితే ఈ మార్గం అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. కాలజ్ఞానాన్ని బోధించిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అన్నమయ్య తిరుమలకు నడిచివెళ్ళిన మార్గంకు అతి సమీపంలోని మామండూరు మహానగరం అవుతుందని పేర్కొన్నట్టు జిల్లావాసులు అంటుంటారు. మరి అన్నమయ్య కాలిబాట ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఆధారంగా చేసుకొని నమ్మకంతో జిల్లావాసులున్నారు.

ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి

కడప,(కల్చరల్)డిసెంబర్ 2: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, లేని పక్షంలో అభివృద్ధి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ నగర అధ్యక్షుడు బండి జక్కరయ్య పేర్కొన్నారు. శ్రీ చైతన్యజూనియర్ కాలేజిలో శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా, టిడిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిర్వహించిన విద్యార్థి ప్రజాబ్యాలెట్ కార్యక్రమానికి జక్కరయ్య ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపికి ప్రత్యేక హోదా అమలుచేస్తేనే రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజానీకానికి మేలు జరుగుతుందన్నారు. లేనిపక్షంలో రాష్ట్రం అన్నివిధాల కుంటుపడి ప్రజలు అనేక అవస్థలుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు జీవనోపాధిలేక ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులుపడాల్సి వస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేకహోదా అనివార్యమని, హోదాతో పరిశ్రమలు వస్తాయని లేనిపక్షంలో రాష్ట్రం అన్ని విధాల కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాబ్యాలెట్‌లో 1200 మంది విద్యార్థులు పాల్గొని తమ ఓటును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నగర అధ్యక్షుడు తిరుమలేష్, నాయకులు సాత్విక్, సుభాన్‌బాషా, ఆదిల్, హుస్సేన్, సాయి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.