కడప

స్నేహితుడి విందుకు వచ్చి పెన్నాలో యువకుడి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,డిసెంబర్ 4: స్నేహితునికి కుమార్తె పుట్టడంతో సిద్దవటం పెన్నానది వద్ద ఆదివారం ఏర్పాటుచేసిన విందులో ఓ యువకుడు గల్లంతైన విషాధసంఘటన చోటుచేసుకుంది. యువకుడి స్నేహితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ఇందిరానగర్ గ్రూప్ హౌస్‌కు చెందిన చాన్‌బాషాకు ఇటీవల కుమార్తె జన్మించడంతో పెన్నానది వద్ద విందు ఏర్పాటుచేసి స్నేహితులను ఆహ్వానించాడు. విందుకు వచ్చిన స్నేహితుల్లో ఒకరైన యనమల రామాంజనేయులు అలియాస్ గండి (21) అనే యువకుడు తన శరీరానికి ఇసుక అయ్యిందని కడుగుకొని వస్తానంటూ సమీపంలోని నీటి వద్దకు వెళ్లాడు. అనంతరం నీటిలో దిగి ఈతాడుతూ నీటి ఒరవడికి తట్టుకోలేక కొట్టుకుని వెళ్లాడు. ఈసంఘటన గమనించిన స్నేహితులు రక్షించేందుకు నీటిలోకి దిగారు. నీటి ప్రవాహానికి వారు కూడా కొట్టుకునిపోతూ ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి వారికి రామాంజనేయులు కన్పించకపోయే సరికి పెన్నానదిలో గాలించి చేసేది లేక ఒడ్డుకు చేరారు. ఇంతలో యువకుడి కుటుంబసభ్యులకు వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా పెన్నానది వద్దకు వచ్చారు. రామాంజనేయులు ఇందిరానగర్‌కు చెందిన పుల్లమ్మతో ఆరునెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారన్నారు. ఈమేరకు పోలీసులు జాలర్లసహాయంతో పెన్నానదిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయమై ఏఎస్‌ఐ చెన్నయ్యను అడుగగా యువకుడి ఆచూకీ లభించలేదన్నారు.
చెన్నూరు వద్ద మరోకరు...
చెన్నూరు: మండలంలోని కొండపేట పెన్నానదిలో వడ్డేరాముడు (25) అనే యువకుడు నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. ఆదివారం కొండపేటలో ఇంటి గృహప్రవేశానికి కడప రవీంద్రనగర్‌కు చెందిన బేల్దా ర్లు వచ్చారు. మధ్యాహ్నం గృహప్రవేశం అనంతరం కొంతమంది యువకులు సాయంత్రం 6గంటలకు పెన్నానదిలో ఈతకు దిగారు. వడ్డెరాముడు నదిలో కూరుకుపోయాడు. నదిలో కొంతమంది వెతికినప్పటికీ కన్పించలేదు. చెన్నూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్, రెవెన్యు సిబ్బంది నది వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక బెస్తవారి సహకారం తీసుకున్నా రాత్రివరకు గల్లంతైన యువకుడి జాడ కన్పించలేదు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు ఏర్పడ్డాయి.