కడప

జిల్లా వ్యాప్తంగా జల్లులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 4: జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో తుంపర జల్లులు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. శనివారం రాత్రి కూడా వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల కొంతమంది రైతులకు ఉపశమనం కలిగినా మరికొంతమంది రైతులకు నష్టమే చేకూర్చింది. ఖరీఫ్‌లో సాగుచేసిన వరి, ఆరుతడిపంటలు, కూరగాయలసాగుకు ఇబ్బందికరంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణంలో పూర్తిమార్పు వచ్చి చీడపీడలు అధికంగా సోకుతాయని, అరకొర పంటలు సాగుచేసుకున్న రైతాంగం ఆందోళన చెందుతున్నారు. సర్వసాధారణంగా ప్రతి నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం గానీ, వాయుగుండంగానీ ఏర్పడి ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగుచేసిన పంటలకు మేలుకంటే కేడీ ఎక్కువగా చేస్తున్నాయి. జిల్లాలో వరికోతలు మొదలుకావడంతో ఈ వర్షంతో ఒడ్లురాలిపోతున్నాయి.
కంది, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, మినుము పంటలకు ప్రస్తుతం నెలకొన్న వాతావరణ మార్పులు పంట దిగుబడి కంటే ఎక్కువ నష్టమే వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలే ఈ ఏడాది వర్షాభావంతో పంటలు దిగుబడి లేక 32 మండలాలను కరవుమండలాలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో రబీసీజన్‌లో సాగుచేసిన పంటలకు ప్రస్తుత వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూరగాయలు, టమోటా సాగుచేసిన రైతాంగానికి ఈ వర్షం, వాతావరణ మార్పులు వల్ల పండుమీద కారం చల్లినట్లయ్యింది. రైతుల్లో నెలకొంది. ఉద్యానవనశాఖ కింద సాగుచేసిన పూలతోటలు, పండ్లతోటలు, నర్సరీలు తదితరాలకు వైరస్ అధికంగా సోకి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఉద్యానవనశాఖ అధికారులే అంటున్నారు. ఈ వర్షం వల్ల కుంటలు, చెరువులు, నదులు, ప్రాజెక్టుల్లో ఏమాత్రం నీరు చేరలేదు. అసలే చలికాలంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ చిరుజల్లులు వల్ల విషజ్వరాలు, డెంగ్యు, మలేరియా, చికున్ గున్యా వ్యాధులు విజృంభించనున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం పడుతున్న వర్షం జల్లులతో మేలుకంటే కీడే అధికంగా కలగనుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని వాఖ్యలు హాస్వాస్పదం

వేంపల్లె, డిసెంబర్ 4: నేను పేదల కోసమే పనిచేస్తున్నాను అవినీతిని నిర్మూలిస్తున్నాను తానొక పకీర్‌నని దేశ ప్రధాని మోదీ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన కాష్ట్లీ పకీర్ అని పీసీసీ ఉపాధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి వర్ణించారు. వేంపల్లెలో తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు గాడ్సే అహింసను ప్రబోధించినట్లు ఉందన్నారు. బీజేపీని నడిపిస్తున్నదే నల్లధన కుబేరులని బీజేపీకి కర్త, కర్మ, క్రియ అన్నీ వారేనని ఆయన అన్నారు. మోదీ మంత్రివర్గం కోటీశ్వరులతో నిండిపోయిందన్నారు. క్రిమినల్ ఆక్టివిటీస్ ఉన్న వారికే పదవులు దక్కాయన్నారు. మోదీ బహిరంగసభలకు నల్లధనంతోనే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్డీయే హయాంలో కార్గిల్ శవపేటికల కుంభకోణం ఎంపీ లాడ్య్స్‌లో కమిషన్లు పార్లమెంటులో ప్రశ్నలు వేసినందుకు కమిషన్లు తీసుకొని బీజేపీ ఎంపీలు పదవులు కోల్పోయిన ఘనచరిత్ర ఉందన్నారు. తాను పకీర్‌నని మోదీ చెప్పుకోవడం పెద్ద జోక్, ఈయన రూ.10 లక్షలు సూటు వేసుకునే రోబోకు నాలుగు సూట్లు మార్చే అత్యంత ఖరీదైన పకీర్ అని ఆయన వివరించారు.
టీడీపీ నుండి కాంగ్రెస్‌లోకి ..
తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు వ్యక్తులు పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.