కడప

రైతులకు అనుకూలించని రబీ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, డిసెంబర్ 4: నేడు రబీ పంటసాగులో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగైన మినుము, శనగపంటను చూస్తే సక్రమంగా దిగుబడులురాని పరిస్థితి నెలకొనివుంది. కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా ఇప్పటికే మినుముపంట పంటనూర్పిళ్లు జరిగాయి. ఎకరాకు కనీసం ఏడెనిమిది క్వింటాళ్లు రావాల్సి వుండగా క్వింటా, రెండు క్వింటాళ్లకే పరిమితమైంది. మినుముపంట సాగులో సకాలంలో వర్షం కురిసివుంటే ఈ పరిస్థితి ఉండేదికాదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది రబీ పంటసాగులో మంచి దిగుబడులు వచ్చినప్పటికీ పిందె, కాయదశలో ఉన్న సమయంలో వర్షాలు కురిసి మినుము ధాన్యం దెబ్బతింది. ఈయేడాది రబీ పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. భూమిలో తేమశాతం లేకపోవడంతో మినుముకట్టె పెరుగుదల ఆగిపోయింది. సాగునీటివసతి కలిగిన కొద్దిమంది రైతులు మాత్రమే పంటకు నీటితడులు అందిస్తున్నారేతప్ప మెట్ట రైతులకు మినుము సాగు నష్టాన్ని కలిగించింది. పురుగుమందులు, రసాయనిక ఎరువులు విత్తుకొని వేలాదిరూపాయలు వ్యయం చేసిన రైతాంగానికి తీరా పంట దిగుబడులు వచ్చేసరికి పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతయేడు వ్యవసాయాధికారులు మినుము, పెసర పంటలు సాగుచేసిన రైతులకు వర్షాల వలన పంటలు దెబ్బతినడంతో పంట, రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇంతవరకు రైతాంగానికి ఒక్క పైసాకూడా ఇన్‌పుట్ సబ్సిడీ రాలేదు. అలాగే శనగపంటలను కూడా అరకొర పరిస్థితుల్లోనే సాగుచేశారు. పంట సాగుచేసిన తర్వాత వర్షం వస్తుందనుకున్న రైతాంగానికి రెండునెలలు కావస్తున్నా వర్షం జాడ కనిపించలేదు. ఎక్కువగా ప్రొద్దుటూరు, రాజుపాళెం తదితర ప్రాంతాల్లో శనిగపంట సాగుచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండల పరిదిలోని గ్రామాల్లో వర్షం లేకపోవడంతో రైతులు పంటసాగు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. రబీలో విస్తారంగా సాగు కావలసిన శనిగ కూడా పూర్తి స్థాయిలో పంటసాగు కాలేదు. క్వింటాలు శనిగ ధర రూ.17 వేలు పలకడంతో ఆ పంటసాగుపై ఆశలు పెట్టుకున్న రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. ముందుగా సాగైన శనగపంట పూత దశలో వుండడంతో నాడా తుఫానుతో గత మూడురోజులుగా అక్కడక్కడా జల్లులు కురిసి ఆకాశం మేఘావృత్తం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆతర్వాత పంట సాగుచేసిన రైతులకు వర్షం వచ్చే ఇబ్బంది లేకున్నా ఆ వర్షం కూడా రైతులతో దోబూచులాడుతోంది. పదునైన వర్షం కురుస్తే పంటసాగు చేయలేని ప్రాంతాల్లో శనగ సాగుచేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా అటు మినుము, ఇటు శనగపంట సాగుకు రబీ అనుకూలించడం లేదు. పంట దిగుబడులు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ధనవంతులెవ్వరూ బ్యాంకుల వద్ద క్యూలో లేరు: ఎమ్మెల్యే
రామాపురం, డిసెంబర్ 4: ధనవంతులు బ్యాంకుల వద్ద క్యూలైన్లో కనిపించడం లేదని కేవలం పేదవారు మాత్రమే అష్టకష్టాలు పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని హసనాపురం పంచాయతీ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లాక్‌మనీ వారిని గుర్తించి చర్యలు తీసుకోకుండా సామాన్యులను ఇబ్బందులు పెట్టడం తగదన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నీరు-చెట్టు పనులు చేపట్టి నియోజకవర్గాల్లోని ఇన్‌ఛార్జులకు పెత్తనం పెట్టడంతో పూర్తిగా అవినీతి జరుగుతున్నదన్నారు. ప్రస్తుతం ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నిర్వీర్యమయ్యే అవకాశాలు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేదలపైన చట్టాలు ప్రయోగించి ఇబ్బందులు పెడుతున్నారని, ధనవంతులు వీరంతా క్షేమంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే వెలిగల్లు నీరు చెరువులకు నింపుతామని నాయకులు ఆర్భాట ప్రచారాలు చేశారని, ఇంత వరకు నీరు నింపలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇండేన్ గ్యాస్ యజమాని వెంకటసుబ్బారెడ్డి, మాజీ జడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, ఇరుగులరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.