కడప

టిడిపి సభ్యత్వ నమోదులో మూడవ స్థానంలో కడప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 4:తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం నెలరోజులపాటు నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన జన చైతన్యయాత్రలు సందర్భంగా ఇప్పటివరకు నమోదుచేసిన సభ్యత్వాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలోకి చేరింది. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) నేతలందరితో 30రోజుల్లో సభ్యత్వాలను నమోదుచేయడంలో తనదైన శైలిలో అందర్నీ కలుపుకుని వ్యవహరించడంతో దాదాపు మూడులక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మరో లక్ష సభ్యత్వాలు నమోదుకు చేసేందుకు శ్రీనివాసులురెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో లక్ష సభ్యత్వాలను జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి, జమ్మలమడుగు ఇన్‌చార్జ్ పి.రామసుబ్బారెడ్డిలు సంయుక్తంగా వ్యవహరించడంతో ప్రథమస్థానానికి చేరింది. జిల్లా వ్యాప్తంగా గతంలో 2లక్షల 25వేలు సభ్యత్వాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెలరోజుల్లో సభ్యత్వాల సంఖ్య మూడు లక్షలకు చేరినట్లు టిడిపి నాయకుల అంచనా. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం మూడు లక్షల సభ్యత్వాలు పూర్తిచేయగా మరో లక్ష సభ్యత్వాలు పూర్తిచేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమేరకు ఆదివారం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపిలు, మరోలక్ష సభ్యత్వ నమోదులు చేయాలని శ్రీనివాసులురెడ్డి సూచించారు. శ్రీనివాసులురెడ్డి సీనియర్లు, జూనియర్లు అనే తారతమ్యం లేకుండా అందర్నీ కలుపుకుని పోతూ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేసేందుకు ఆయనే ఒక అడుగు ముందుకేసి పార్టీ బలోపేతం దిశగా పయనిస్తూ పార్టీ ఆశించినదానికంటే లక్ష సభ్యత్వాలు అధికంగా చేసేందుకు కృషి చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈమేరకు సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా లక్ష సభ్యత్వాలు పైబడి నమోదుచేసేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థాయి దక్కించుకోనున్నారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి నియోజకవర్గాల వారీగా అన్ని వర్గాలకు చెందిన నేతలతో సమన్వయపరుస్తూ జిల్లా ఇన్‌చార్జ్‌లను , సీనియర్ నేతలను ఏ ఒక్కరికీ ఇబ్బందిపెట్టకుండా పార్టీ బలోపేతం దిశగానే అడుగులు వేయడంతో జిల్లాలో పార్టీ బలోపేతం కావడంతోపాటు సభ్యత్వాలకు కూడా అధిష్టానానికి అంచనాలు మించే నమోదుకావడంతో జిల్లాలోనూ శ్రీనివాసులురెడ్డి కృషి ఫలించిందని చెప్పవచ్చు.