కడప

హోంగార్డులు, పోలీసులది విడదీయరాని బంధం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(క్రైమ్)డిసెంబర్ 6: హోంగార్డులకు, పోలీసులకు విడదీయరాని అనుబంధం ఉందని ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ అన్నారు. మంగళవారం 54వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప పోలీసు పేరేడ్‌మైదానంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రామకృష్ణ హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖకు, హోంగార్డులకు విడదీయరాని అనుంబంధం ఏర్పడిందని వారి సంక్షేమానికి తానుప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. హోంగార్డుల సమస్యలు తెలుసుకునేందుకు ఇద్దరు సభ్యులను పోలీసు సంఘంలో నియమించామన్నారు. హోంగార్డులకు కో-ఆపరేటివ్ సొసైటీలో చేర్చుకుని రుణాలు మంజూరు చేస్తామన్నారు. జీవితంలో హోంగార్డులు వారి జీవితాలతో పొదుపుగా ఉండాలన్నారు. మృతి చెందిన ఏడు మంది హోంగార్డుల భార్యలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఓఎస్‌డి సత్యయేసు బాబు మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, హోంగార్డుల విధులు కానిస్టేబుల్ విధుల్లాగే ఉంటాయన్నారు. ఏఆర్ డిఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ ఎస్పీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హోంగార్డుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కుటుంబాలకు చెందిన సభ్యులకు హోంగార్డుగా నియమించామన్నారు. హోంగార్డుల పదవీ విరమణ అనంతరం రూ.1.50లక్షలు ఆర్థికసాయం చేయనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీఅశోక్‌కుమార్, ఎస్‌బి డిస్పీ రాజగోపాల్‌రెడ్డి, సిఐలు పాల్గొన్నారు.