కడప

ఫించన్ల కోసం వృద్ధుల అగచాట్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట, డిసెంబర్ 6: నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్దనోట్ల రద్దును ఎవ్వరూ వ్యతిరేకించకపోయినా, ఈ పెద్దనోట్ల రద్దుతో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. ముఖ్యంగా డిసెంబర్ మాసం మొదలైన మొదటివారంలో ఫించనుదారులు పడుతున్న అవస్థలు చెప్పనలవి కావడంలేదు. రూ.1000 వృద్ధాప్య ఫించన్ కోసం బ్యాంకుల్లో మరో రూ.1000 జమచేసే దుస్థితిని వృద్ధులు ఎదుర్కొనాల్సి వస్తుంది. వికలాంగులైతే రూ.రూ.1500 ఫించన్‌కు రూ.500 రూపాయలు జమచేసే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో రూ.1000 జమ చేసేందుకు తమ వద్ద డబ్బులు లేవని వృద్ధులు అంటుంటే ఏ మాత్రం మానవత్వం లేకుండా కొన్ని బ్యాంకులు రూ.1000 జమచేస్తేనే ఫించన్ ఇస్తామంటున్నారు. ఎందుకంటే బ్యాంకుల వద్ద రూ.2000 నోట్లు ఉండడంతో చాలా బ్యాంకులు రూ.1000 ఫించన్ ఇవ్వలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కనీసం బ్యాంకులు ఫించన్ దారుల కోసమైనా రూ.100 నోట్ల కట్టలు మొదటి వారంలో ఉంచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఫించన్ కోసం తిరిగి తామే డబ్బులు జమచేసే పరిస్థితి రావడంపట్ల తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రూ.1000 లేని వృద్ధులు తమ ఫించన్ రూ.1000 ఎలా తీసుకోవాలో అర్థంకాక బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి దుస్థితిని బ్యాంక్ ఉన్నతాధికారులు గుర్తించి సత్వరం ఫించన్‌దారులకు వారి ఫించన్ ఎలాంటి జమ చేయకుండా ఇచ్చే పరిస్థితిని తీసుకురావాల్సి ఉంది. అంతేకాకుండా కొన్ని బ్యాంకులు ఫించన్‌దారులకు వారి ఫించన్ ఇచ్చేందుకు ప్రత్యేక వసతులు సమకూర్చి, వారి నుండి ఎలాంటి జమలులేకుండా వారి ఫించన్ ఇస్తున్నా, మరికొన్ని బ్యాంకులు మానవత్వంమరచి ఫించన్‌దారులను వృద్ధులైనప్పటికీ క్యూ లైన్ల ద్వారానే డబ్బులు తీసుకునేందుకు అనుమతిస్తుండడంపట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫించన్‌దారుల పరిస్థితి ఇలా ఉంటే మెజార్టీ కుబేరులు నేరుగా బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందితో తమకున్న పరిచయాల దృష్ట్యా తమ లావాదేవీలను నేరుగా, ఏదోవిధంగా గోప్యంగా జరుపుకుంటూ ముందుకెళుతున్నారు. బ్యాంకుల్లో పనులకోసం, డబ్బులు డిపాజిట్ చేసేందుకు, డ్రా చేసేందుకు, ఇతరత్రా పనులున్నవారు సామాన్యులు, మధ్యతరగతి వర్గాలే అత్యధికంగా ఇబ్బందులుపడక తప్పనిసరి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పెద్దనోట్ల రద్దు అయ్యి నెల అవుతున్నా బ్యాంకుల వద్ద సామాన్యులు, మధ్యతరగతి ప్రజలతో పాటు వ్యాపారస్తులు, ఇతరత్రా పలు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు యధాతథంగా ఉన్నాయి. సగానికి సగం ఏటిఎంలు మూసి వేస్తున్నారు. తెరిచిన ఎటిఎంలు కూడా కొన్ని గంటల తరువాత వాటిల్లో డబ్బులు అయిపోతుండడంతో ఏమీచేయలేక నిరాశ నిస్పృహలతో వినియోగదారులు వెనుదిరగక తప్పడం లేదు. మొత్తానికి పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరుల మాట ఎలా ఉన్నా సామాన్య, మధ్యతరగతి ప్రజలు, వ్యాపారస్తులు ఇతర పేదవర్గాలు, కార్మికులు ఎన్నడూ లేని విధంగా అనేకరకాలుగా పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కావడం లేదు. అటు వ్యాపారాలు దెబ్బతిని వ్యాపారస్తులు లబోదిబో మంటున్నారు. కనీసం బ్యాంకుల్లో ఫించన్‌దారులకు, వృద్ధులకు, వికలాంగులకైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక వసతులు కల్పించే అంశంపై బ్యాంకు ఉన్నతాధికారులు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది.

దళితుల ఆశాజ్యోతి అంబేద్కర్

కమలాపురం, డిసెంబర్ 6: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసిపి నేతలు ఉత్తమారెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. వారు మంగళవారం స్థానిక వైకాపా కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 60వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ రాజ్యంగ నిర్మాతగా ప్రఖ్యాతిచెంది అందులో బడుగు బలహీన దళుతుల అభివృద్ధికై రిజర్వేజన్లు కల్పించి వారి అభివృద్ధికి ప్రధాన కారకుడైన దళితనేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి ఎస్సీ సెల్‌నేతలు చంటి, బుజ్జి, నగేశ్, పుల్లారెడ్డి, కొండారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా ఉండగా స్థానిక ప్రెస్‌క్లబ్ లో సిపిఐ దళితనేత ఆర్ సుబ్బరాయుడు, ఎమ్మార్పీయస్ నేతలు నరసింహులు, రమణ, రవి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత సమాజానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాష్ట్ర మాలమహానాడు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీవాణి తన అనుయాయులతో కలసి స్థానిక మూడురోడ్ల కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతేకాక వివిధ పార్టీలకు చెందిన పలువురు దళితనేతలు వెంకటరమణ, రమణ, చిన్నా, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నీరాజనాలర్పించారు.

భారత రాజకీయ రంగంలో
ఒక ధృవతార నేలకొరిగింది
కడప,(కల్చరల్)డిసెంబర్ 6: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడం భారత రాజకీయ రంగంలో ఒక ధృవతార నేలకొరిగినట్లుగా భావించాలని డిప్యూటీ మేయర్ బి.ఆరిఫుల్లా, టిడిపి జిల్లా కార్యదర్శి ముక్తియార్, మైనార్టీ నాయకులు షామీర్‌బాషాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయలలిత చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించి, తమప్రగాఢ సానుభూతి తెలిపారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ దేశ రాజకీయ రంగంలో జయలలితది ఒక విలక్షణ శైలి అని, విప్లవకారిణిగా పేరుతెచ్చుకుని పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని కొనియాడారు. రాజకీయ రంగానికే గాకుండా సినీ రంగంలో కూడా అద్భుతమైన పేరుతెచ్చుకుని రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఆమె అభిమానులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిసిసెల్ నాయకులు రాజగోపాల్, సుబ్బనర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖాసీం తదితరులు ఉన్నారు.
జయలలిత మృతి తీరనిలోటు
రాజకీయంలో ఒక ధృవతారగా వెలిగిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తెలుగు ప్రజలందరికీ తీరనిలోటని డిసిసి కార్యాలయ కార్యదర్శి గిరిధర్ అన్నారు. జయలలిత మరణం తమిళులు ఒక మంచి నాయకురాలిని కోల్పోయారన్నారు. ఈసందర్భంగా జయలలిత కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతిని వ్యక్తం చేశారు.