కడప

అమర జవానుకు అశృ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బద్వేలు, డిసెంబర్ 6: దేశ సేవలో అశువులుబాసిన బద్వేలు ప్రాంతానికి చెందిన కొత్తమద్ది చిన్నవెంకటసుబ్బయ్య మృతదేహం మంగళవారం బద్వేలుకు చేరుకుంది. సిఆర్‌పిఎఫ్ ఎఎస్సై డి.హనుమంతరావు నేతృత్వంలో ముగ్గురు జవాన్లతో కలిసి ప్రత్యేక వాహనంలో వెంకటసుబ్బయ్య మృతదేహాన్ని బద్వేలుకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం వస్తుందన్న సమాచారం పట్టణంలో తెలియడంతో బంధువులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వీరజవాన్ అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు. మృతదేహాన్ని చూసిన భార్య ప్రసన్న, పిల్లలు, కుటుంబ సభ్యుల ఆర్థనాదాలు ఆకాశాన్నంటాయి. మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయి కంటతడి పెట్టారు. ప్రభుత్వం నుంచి వెంకటసుబ్బయ్య అంత్యక్రియలకు మంజూరైన రూ.50 వేల నగదును వెంకటసుబ్బయ్య బంధువులకు మాజీ ఎమ్మెల్యే కె.విజయమ్మ అందజేశారు. అనంతరం మృతదేహం ముందు జాతీయ జెండాలతో పలువురు ముందుకు సాగగా పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ దేశ సేవలో అశువులుబాసిన అమరవీరుడు వెంకటసుబ్బయ్య అని కొనియాడారు.

నిర్లక్ష్యం నీడలో పింఛా ప్రాజెక్టు!

సుండుపల్లె, డిసెంబర్ 6: కడప, చిత్తూరు జిల్లా సరిహద్దులోని సుండుపల్లె మండలం పింఛా నది నిర్మించిన వై. ఆదినారాయణరెడ్డి రిజర్వాయర్ వేల కుటుంబాలకు జీవనాధారం వరప్రసాదం లాంటిది. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం, ఆకర్షణీయమైన దృశ్యాలతో సందర్శకులను ఇట్టే ఆకట్టుకునే ప్రాంతాల్లో జిల్లాలోని పింఛా ప్రాజెక్టు ఒకటి. సందర్శకులకు ఇక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడం, ఉన్న వాటిని అధికారులు పట్టించుకోకపోవడంతో రోజు రోజుకూ సందర్శకుల సంఖ్య తగ్గిపోతోంది. పింఛా ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన పార్కు ఆలనా, పాలనా కరువై పార్కుకు పిచ్చిమొక్కలు, కంపచెట్లతో నిండిపోయింది. ఇక్కడున్న అతిథి గృహాల విడిది అదే పరిస్థితి. ఉన్న అతిథి గృహం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఈ ప్రాంతం అధ్వాన్నంగా తయారైంది. జిల్లా అధికారులు, పర్యాటక శాఖ వారు పింఛా సోయగాలపై దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేస్తే పింఛా పర్యాటకులను ఆకర్షించగలదని స్థానికులు కోరుతున్నారు.
పింఛా ప్రాజెక్టుపైన కుడికాలువకు ఎడమవైపున సుమారు ఒక ఎకరాపైన స్థలాన్ని పింఛా ప్రాజెక్టు పార్కులా తయారుచేసి వదిలారు. అయితే గత ఒకటిన్నర సంవత్సరం నుండి పట్టించుకునే వారు లేక పిచ్చిమొక్కలు ఎక్కువై ప్రాజెక్టు ప్రతిష్టతను దారితీసేలా అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కంపచెట్లతో కంపచెట్లతో నిండి ఉంది. ఇంత జరుగుతున్నా పింఛా ప్రాజెక్టు గురించి నాయకులు కానీ, పింఛా ప్రాజెక్టు నీటిసంఘం అధ్యక్షులు కానీ, అధికారులు కానీ పట్టించుకున్న పాపానపోలేదు. పింఛా ప్రాజెక్టు పేరిట లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పింఛా ప్రాజెక్టు ఉన్న మూడు గేట్లు మరమ్మతులు లేక పింఛాలో వచ్చిన అరకొర నీరు వృధా అవుతోంది. ఇది అధికారులకు పూసగుచ్చినట్లు పలువురు రైతులు చెబుతున్నా వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాగే ఉంటే పింఛా ప్రాజెక్టుపై పెద్దినేనికాల్వ, మాచిరెడ్డిగారిపల్లె, ముడుంపాడు రైతులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి కళ్లముందరే కనపడుతుంది.