కడప

రాజంపేట తెలుగుతమ్ముళ్లలో అంతర్గత విభేధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 6: రాష్టవ్య్రాప్తంగా త్వరలో జరగనున్న నగర పాలక, పురపాలక ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో రాజంపేట పురపాలకానికి ఎన్నికలు జరగాల్సివుండగా అధికారపార్టీ నేతల్లో అంతర్గత విభేధాలు, మున్సిపల్ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. రాజంపేటలో తొలి నుంచి ఏపార్టీలోనైనా కమ్మ, రెడ్ల సామాజిక వర్గాల మధ్యే పోరు ఉండేది. అయితే గత ఎన్నికల నుంచి కమ్మ, కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించని కారణంగా కాపు సామాజికవర్గం కూడా ఒక గ్రూపుగా ఏర్పడింది. రాజంపేట నియోజకవర్గంలో అధికారపార్టీలోని కమ్మ, కాపు, రెడ్ల సామాజికవర్గ నేతల మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రిజర్వేషన్ ప్రక్రియలో పురపాలక చైర్మన్ ఎవరనేది స్పష్టత రావాల్సివుంది. ఇప్పటికే పురపాలక చైర్మన్ రేసులో పాత కాపుల కుటుంబ సభ్యులు, వంశోధ్దారకుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలక రాజంపేటలో ఒక అధికారపార్టీలోనే అరడజను మంది హేమాహేమీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు , పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబులు పలుమార్లు నేతలను హెచ్చరించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించినా రాజంపేట తరపున అధికార పార్టీ నేతల్లోని అంతర్గత విభేధాలు సమసిపోలేదు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వవిప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి , మాజీ మంత్రి పి.బ్రహ్మయ్య, టిడిపి రాష్టస్రీనియర్ నాయకులు డా.జిఎన్ నాయుడు, కాపు కమిషన్ రాష్ట్ర సభ్యులు మోదుగుల పెంచలయ్య, సీనియర్ నాయకుడు మారుతి రామకృష్ణ, ఆర్టీసి మాజీ చైర్మన్ ఎద్దల సుబ్బరాయుడు, బిసి వర్గాలకు చెందిన డాక్టర్ సుధాకర్, మాజీ మండలాధ్యక్షుడు పారా సుబ్బానాయుడు తదితర నేతలు అధికారపార్టీలో బలంగా ఉన్నా నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మూడు మాసాలు క్రితం వైకాపా అధిష్టానం, తెలుగుదేశంపార్టీ అధిష్టానం పురపాలక ఎన్నికలపై రాజంపేటలో సర్వేచేయగా వైకాపాకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తేలినట్లు తెలిసింది. అయినా మూడుమాసాల నుంచి అధికారపార్టీలోని నేతల్లో ఐక్యతారాగం కన్పించలేదు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి కూడా రాజంపేటలో గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అధికారపార్టీ నేతల అంతర్గత విభేధాలు పార్టీ రాజకీయ భవిష్యత్‌ను ఏమాత్రం కాపాడుతాయో కాలమే నిర్ణయించాల్సివుంది.