కడప

పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, డిసెంబర్ 9: గ్రామీణ స్థాయి పాఠశాలల నుంచే విద్యార్థులకు క్రీడలపట్ల మక్కువపెంచి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిఈవో ప్రతాపరెడ్డి అన్నారు. ఆయన మండల పరిధిలోని పెద్దచెప్పల్లి బాలుర జడ్పీ హైస్కూల్లో మూడురోజులుగా జరుగుతున్న యర్రగుంట్ల జోనల్‌మీట్ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుఎంత ముఖ్యమో క్రీడలుకూడా అంతే అవసరం అన్నారు. క్రీడల్లో రాణించిన వారు చదువుల్లో కూడా రాణిస్తారని అన్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. వీరిని ప్రోత్సహిస్తున్న పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులను ఈ సందర్బంగా ఆయన అభినందించారు. అంతేకాక ఇక్కడ జరిగేపోటీల్లో గెలుపొందే విద్యార్థులకు బహుమతులను అందచేసి ప్రోత్సహిస్తున్న దాతలను కూడా ఆయన కొనియాడారు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న పలు క్రీడాపోటీల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం కూడా అభినందనీయమన్నారు. జిల్లాలోని 8జోనల్లో 50శాతం పైగా జోనల్‌స్థాయి క్రీడాపోటీలు గ్రామీణ ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ఈ పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. స్థానిక సియస్ యస్సార్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహింస్లాన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం కేశవరెడ్డి, స్కూల్‌గేమ్స్ జిల్లా కార్యదర్శి శ్రీకాంతరెడ్డి, పిఇటిల అసోషియేషన్ జిల్లా అధ్యక్షుడు శివశంకరరెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పెద్దచెప్పల్లి మాజీ సర్పంచ్ ఓ సుబ్బారెడ్డి తనయుడు రవీంద్రారెడ్డి ప్రథమ బహుమతిని, డిగ్రీ కాలేజి కరస్పాండెంట్ రాజగోపాలరెడ్డి వారి తండ్రుల జ్ఞాపకార్థం ప్రథమ, ద్వితీయ బహుమతులను ప్రకటించారు. జోనల్ మీట్‌లో గెలుపొందిన వీయన్‌పల్లె, యర్రగుంట్ల, కొండాపురం, కమలాపురం, ముద్దనూరు మండలాల పాఠశాలల విద్యార్థులకు డిఈవో ప్రతాపరెడ్డి బహుమతులను అందచేశారు.

పాలకుల నిర్లక్ష్యం వల్లే
రాయలసీమ వెనుకబాటు

కడప,(క్రైమ్)డిసెంబర్ 9: గత పాలకుల నిర్లక్ష్యంవల్లే రాయలసీమ వెనుకబాటు తనానికి గురైందని సీమలోని యువత, ప్రతికార్యకర్త నడుం బిగించి పోరాడినప్పుడే రాయలసీమను అభివృద్ధి బాటలో నడిపించుకోగలుతామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, కార్మికనాయకులు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి, లింగమూర్తిలు పాల్గొనగా రవిశంకర్‌రెడ్డి అధ్యక్షత వహించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ తీవ్ర కరవుకాటకాలతో ప్రపంచంలోనే అత్యంత ఎడారి ప్రాంతమైన కారు ఎడారి తర్వాత రెండవ స్థానాన్ని ఆక్రమించిందని నీటి వసతి లేనందు వల్ల రాబోయే కాలాల్లో ఎడారిగా మారబోతున్నాపాలకులు నిర్లక్ష్యం వహించి ఈప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. రాయలసీమలోని యువకుడు, ప్రతికార్యకర్త నడుంబిగించి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో ఉక్క్ఫ్యుక్టరీ, ఉర్దూ యూనివర్సిటీ, ఎయిమ్స్‌కోసం ప్రత్యేక ఉద్యమాన్ని చేపడతామన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌సిపి నగర కార్యదర్శి మగ్బుల్‌బాషా, నాయకులు చంద్రారెడ్డి, బాల చెన్న య్య, శేఖర్, సిద్దిరామయ్య, ఓబయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.