కడప

ఎర్రచందనాన్ని పరిరక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతకొమ్మదినె్న,డిసెంబర్ 9: అడవులను పరిరక్షించితే వాతావరణ కాలుష్యనివారణతోపాటు వర్షాలు సకాలంలో కురుస్తాయని ,అడవుల్లోని ఎర్రచందనాన్ని పరిరక్షించాలని అటవీ టాస్క్ఫోర్స్ సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఇప్పెంట పంచాయతీ వెంకట్రామ్‌పల్లెలో ఎర్రచందనం పరిరక్షణపై అవగాహన సదస్సులు ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా అటవీటాస్క్ఫోర్స్ సిబ్బంది ఎఫ్‌ఆర్‌ఓ జివి రమణారెడ్డి ఆధ్వర్యంలో వనచైతన్యయాత్రలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎర్రచందనం టాస్క్ఫోర్స్ డిఐజి మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎర్రచందనం పై అవగాహన సదస్సు ఏర్పాటుచేయడం జరిగిందని ఇందులో భాగంగా మండల పరిధిలోని వెంకట్రామ్‌పల్లి, మద్దిమడుగు తదితర ప్రాంతాల్లో ఈకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈసందర్భంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎర్రచందనం అక్రమంగా నరికే వారిని గుర్తించి తమకు సమాచారం అందించాలన్నారు. అంతేగాకుండా ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి తరలిస్తే కేసులు నమోదుచేస్తామని వారు హెచ్చరించారు. ఈసందర్భంగా ప్రజలకు చైతన్యయాత్రల ద్వారా లఘుచిత్రాల ద్వారా ఎర్రచందనాన్ని పరిరక్షించాలని సూచించారు.కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది పాపారావు, మహేశ్వరరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.

ముంపుబాధితులకు
పరిహారం చెల్లింపులో
ప్రభుత్వాలు విఫలం

సిద్దవటం,డిసెంబర్ 9: సోమశిల వెనుకజలాలతో ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేయించి 30సంవత్సరాలు గడుస్తున్నా ముంపుబాధితులకు పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని బిజెవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు రమేష్‌నాయుడు ఆరోపించారు. మండలంలోని మాధవరం 1 గ్రామ పంచాయతీ సచివాలయంలో శుక్రవారం ముంపుబాధితుల సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984-85 సంవత్సరంలో మునకప్రాంతమైన పాతమాధవరం నుంచి ఇక్కడికి వచ్చి మూడుగ్రామాల్లో స్థిరపడ్డారన్నారు. నేటి నుంచి నేటి వరకు ప్రభుత్వం తమకు నష్టపరిహారం, ఉద్యోగావకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన దృష్టికి బాధితులు తెచ్చారు. అలాగే తమకు వయోపరిమితి లేకుండా తమ వారసులకు ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు అప్పట్లో భూమి బదులుగా భూమి, ఇంటికి బదులుగా ఇళ్లు, అర్హులకు చదువులను బట్టి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం అప్పట్లో హామీ ఇచ్చిందన్నారు. వీరి సమస్యలు మంత్రి దేవినేని దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్టక్రార్యవర్గ సభ్యుడు గుణవర్మ, జిల్లా నాయకులు విజయేంద్రబాబు, రాజోలి సుబ్బరాయుడు, అమరనాథశర్మ, మోహన్‌రావు పాల్గొన్నారు.