కడప

కార్యకర్తలకు అండగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, డిసెంబర్ 25: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆదివారం వేంపల్లె మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన మండల ఉపాధ్యక్షుడు సమాధి వద్ద ఆయన నివాళులు అర్పించారు. అలాగే ఆయన కుటుంబసభ్యులను స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ఉపాధ్యక్షుడు ఎంత మంచివాడో మండలంలో అందరికీ తెలుసునన్నారు. అటువంటి వ్యక్తిని ఈ నెల 9వ తేదీన మండల సమావేశం ముగించుకొని అలవలపాడు గ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డిని సుమోతో ఢీకొట్టించి అతి దారుణంగా నరికి చంపడం శోచనీయమన్నారు. ఇలాంటి వారిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడని ఆయన అండదండలతోనే ఇవి సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంపిన వారికి ఎందుకు చంపారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. పులివెందుల నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి హత్యలు చోటు చోసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించకూడదని ఆయన తెలిపారు. అనంతరం వేంపల్లె పట్టణానికి చెందిన గాజులపేటలో నివాసం ఉంటున్న అంజి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందడం జరిగింది. ఆ కుటుంబీకులను కూడా జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఏ ఒక్క కార్యకర్త అధైర్యపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండమని తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. ఆయన వెంట వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబులరెడ్డి, యువజన నాయకుడు ఆర్. శ్రీనివాసులు, జడ్పీటీసీ షబ్బీర్‌వలి, మైనార్టీ నాయకులు మునీర్, నాయకులు రామగంగిరెడ్డి, ప్రసాద్, భారతి, సల్మా, పాలేటిరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రి రావెల ఎదుగుదలను ఓర్వలేకనే కుట్రలు

కడప,డిసెంబర్ 25: రాష్టమ్రంత్రి రావెల కిశోర్‌బాబు అత్యంత విద్యావంతుడై, ఉన్నతాధికారిగా వుంటూ రాజకీయాల్లోకి వచ్చి బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత సేవలందిస్తుంటే ఆయన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొంతమంది ప్రతినిత్యం ఆయనపై నిందలు వేస్తున్నారని పలు దళిత సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మేధావుల ఫ్రంట్ నాయకులు రాష్ట్ర, జిల్లా నేతలు శంకరయ్య, రమణ, ఆంజనేయులు, తిమ్మయ్య, మైనార్టీ మేధావులు హుస్సేన్‌బీ, ఖలీల్, సుబ్బరాయుడు, అమీర్‌బాషా, జ్యోతిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంత్రి రావెల కిశోర్‌బాబు కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా కొంతకాలం కొనసాగి వివాదాలకు దూరంగా వుంటూ అందర్నీ కలుపుకుని పోయే వారని అధికారులతో, అనధికారులతో కలియ తిరుగుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రాముఖ్యత ఇచ్చేవారని వారు గుర్తు చేశారు. మంత్రి ప్రతి విషయం ఆచితూచి అడుగువేస్తూ, ఏ విషయంలో తొందరపడకుండా బడుగులంటే అమితమైన ప్రాణమని వారు గుర్తు చేశారు. అయితే గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ తాజాగా మంత్రిపై ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, పదవీకాలం ముగుస్తుండటంతో రెండున్నర సంవత్సరం ఒక బిసి మహిళకు, మరో రెండున్నర సంవత్సరం మరో బిసి మహిళకు ఆనాడు స్వయంగా ఒప్పందాలు చేసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైందని వారు తెలియజేశారు. చిన్న వయస్సులో జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎంపికైన మహిళ కేవలం పదవికోసం రావెలను విమర్శించడం, రాద్దాంతం సృష్టించడం, ధర్నాలు చేయించడం వల్ల ఆ పార్టీ పరువు ప్రతిష్టలు మంటలో కలుపుతోందని ఆరోపించారు. ఆయన ఎదుగుదలకు ఎవరూ ఆపలేరని, మేధావి అయిన కిశోర్‌బాబును ఎదిగితే బడుగు, బలహీనవర్గాలంతా పైకి ఎదుగుతారని తద్వారా కొంతమందికి అన్యాయం జరుగుతుంన్న ఉద్దేశ్యంతోనే కిశోర్‌బాబుపై అవాకులు చవాలు పేలుతూ కొన్ని వర్గాలు ఆయనపై తప్పుడు, విషప్రయోగం చేసి ఆయన ఎదుగుదల చూసి ఓర్వలేక ఉన్నారని వారు ఆరోపించారు. ఇదే తరహాలో మంత్రిపై బురదచల్లితే తెలుగుదేశం ప్రతిష్ట దిగజార్చడమేనని వారు ఆరోపించారు. మంత్రి రావెల నిరక్షరాస్యుడై ఉండి అందరికీ సలామ్‌లు, గులామ్‌లు కొడుతూ డూడూ బసవన్నగా వ్యవహరిస్తున్నట్లయితే వీరులు విక్రమార్కుడని ప్రతి ఒక్కరు కొనియాడేవారని ఆయన చదువుకున్న మేధావి అయినందునే ఆయనకు ఈ నిందలు వస్తున్నాయన్నారు. పార్టీ ప్రస్తుతం త్రిమ్యాన్ కమిటీ వేసి జెడ్పిచైర్ పర్సన్ మంత్రిపై చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టడం హర్షించదగ్గవిషయమన్నారు. మంత్రి కిశోర్‌బాబుకు బడుగు బలహీనవర్గాలైన, మహిళలన్నా, మతపెద్దలన్నా ఎనలేని అభిమానమన్నారు. వారు ఈమేరకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబులకు లేఖలు రాశామన్నారు. అయితే త్రిమ్యాన్ కమిటీ విచరాణ నిష్పక్షపాతంగా జరగాలని వారు డిమాండ్ చేశారు.