కడప

ఒంటిమిట్టలో కనువిందు చేస్తున్న కోదండరామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 17: కోదండరామయ్య బ్రహోత్మవాలు ఒంటిమిట్టలో కలియుగ వైకుంఠాన్ని తలపిస్తున్నాయి. టిటిఢి ఆధ్వర్యంలో తొలిసారిగా చేపడుతున్న ఈ ఉత్సవాలకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఆదివారం రామయ్య వటపత్రసాయి అలంకారంలో దర్శనమిచ్చారు. రాత్రి సింహవాహనంపై గ్రామపురవీధుల్లో ఊరే గారు. సోమవారం ఉదయం నవనీత కృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమీయనున్న రామయ్య సాయంత్రం హనుమ వాహనంపై ఊరేగనున్నారు. ఒంటిమిట్ట కోధండ రామునికి ఈ నెల 20వ తేది నిర్వహించే కల్యాణోత్సవానికి ఒంటిమిట్ట రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నారు. ఈ కల్యాణోత్సవానికి సిఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహాన్ విచ్చేస్తుండడంతో అందుకు తగట్టు ఏర్పాట్లన్నీ జిల్లా యంత్రాంగం, టిటిడి చేస్తుంది. రాములోరి 70 ఎకరాల స్థలంలో కల్యాణ వేదిక సిద్దం అవుతుంది. వేదిక ప్రాంతమంతా ఇనుప షెడ్లు, అద్భుతమైన విద్యుత్ కాంతులతో, దేవతామూర్తుల కటౌట్‌లతో నేత్రపర్వంగా తయారైంది. రామయ్య కల్యాణాన్ని తిరులేశుని తరహాలో నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆలయ మూడు గోపురాలను ధగ ధగ మెరిసే వైకుంఠాన్ని తలపిస్తుంది. 20వ తేది చతుర్థశి చివరి గడియల్లో, పౌర్ణమి ప్రారంభంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఒంటిమిట్ట చుట్టూ మకర తోరణాలు, అద్భుతమైన విద్యుత్ దీపాలు, మామిడి మండలతో శోభాయమానంగా అలంకారమైంది. భద్రతారీత్యా పోలీసులు గట్టి చర్యలు తీసుకొంటున్నారు. ఆర్టీసీ వారు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఒకో సమయంలో స్వామివారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. కల్యాణం తిలకించేందుకు ఎల్‌ఇడి టివిలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ సైతం ఉత్సవాల విజయవంతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారు. దశరథరామయ్య మరో రెండు రోజులో సీతమ్మ మెడలో మాంగల్యధారణ చేయనున్నారు. రామయ్య కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.