కడప

జిల్లాకు దక్కని జాతీయ విద్యాసంస్థలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 1: రాష్టవ్రిభజనలో భాగంగా కేంద్రం జాతీయ స్థాయి విద్యాసంస్థలు మంజూరుచేసినా జిల్లాకు ఒక జాతీయ విద్యాసంస్థ కూడా దక్కలేదు. కేవలం ముస్లింమైనార్టీలు అధికంగా ఉన్నారని వౌలానా అబ్దుల్‌కలామ్ ఆజాద్ విశ్వవిద్యాలయంలో భాగంగా ఒక స్టడీసెంటర్‌ను మాత్రమే మంజూరు చేశారుకానీ ఇంతవరకు ఆ సెంటర్ భూమిపూజకు కూడా నోచుకోలేదు. జిల్లాలో అనేక వనరులు విస్తారంగా ఉన్నా ఇటు జిల్లా నేతలు కానీ, అటు పాలకులు కానీ జిల్లా గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కుప్పలు తెప్పలుగా నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమకూర్చినా జిల్లా విషయంలో ఎందుకు వెనకేస్తున్నారో అర్థం కావడంలేదని మేధావులు ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచి సీమ జిల్లాల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందని అప్పటి కోటిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పెద్దసంజీవరాయుడు, చిన సంజీవరాయుడు, డాక్టర్ ఎంవి రమణారెడ్డి , డాక్టర్ ఎంవి మైసూరారెడ్డిలతోపాటు పలువురు గొంతెత్తి ఆక్రోశించినా ఫలితం దక్కలేదు. రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రానికి సెంచూరియన్, విట్, ఎస్‌ఆర్‌ఎం, వేల్టెక్, శ్రీసిటి, ఐఎఫ్‌ఎంఆర్, గ్రేట్‌లెక్స్ విద్యాలయాలు ప్రైవేట్‌పరంగా రాష్ట్రానికి దక్కాయి. ఇక కేంద్రప్రభుత్వం పరంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం, నిట్, ఎయిమ్స్, ఐఐటి, గిరిజన విశ్వవిద్యాలయం, ఐఐఎం, ఐఐఎస్‌ఇఆర్, ఐఐటి, కేంద్రపరంగా విద్యాలయాలు రాష్ట్రానికి మంజూరయ్యాయి. ఇంతవరకు ఏ ఒక్క జాతీయ స్థాయి ప్రభుత్వపరంగా కానీ, ప్రైవేట్‌పరంగా కానీ ఒక సంస్థ కూడా జిల్లాకు దక్కకపోవడంపై సర్వత్రా ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తవౌతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం, యాస్‌బెస్టాస్, ముగ్గురాళ్లు, యురేనియం నిక్షేపాలు జిల్లాలో విస్తారంగా ఉన్నా ఆ నిక్షేపాల ద్వారా ఒక పరిశ్రమను కూడా జిల్లాలో నెలకొల్పక పోవడంపై జిల్లా ప్రజలు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. సమైక్యాంధ్రవాదన విన్పించిన ప్రాంతాలకు దేశస్థాయిలో సంస్థలు అప్పనంగా అప్పచెప్పారు. సమైక్యాంధ్రకోసం గొంతెత్తిచాటి తొలి నుంచి ఉద్యమాలు చేపడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో కడప చివరిదని దేశం యావత్తు తెలియనివారు ఉండరని, అయితే ఒక సంస్థకూడా జిల్లాకు కేటాయించకపోవడంపై అధికారపార్టీ నేతలు నోరుమెదపడం లేదని సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం అత్యంత వెనుకబడిన కడపకు ఏదైనా దేశస్థాయి గుర్తింపుపొందిన విద్యాసంస్థకానీ, భారీ పరిశ్రమకానీ నెలకొల్పి జిల్లా ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లాకు నీరు తెస్తామంటే జగన్ అడ్డుకుంటున్నాడు..

కడప,జనవరి 1: రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఎదురైనా ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి సీమ జిల్లాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అడ్డుతగులుతున్నాడని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) ఆరోపించారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీకార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థికలోటు ఉన్నా కేవలం గండికోట నిర్వాసితులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రూ.479 కోట్లు ఇవ్వడానికి జివో విడుదల చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్షనాయకుడు జగన్, ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు గండికోట నిర్వాసితులను అనవసరంగా రెచ్చగొట్టి పరిహారం పేరిట రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయత్నాలు చేశారని, నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజి విడుదలతో ప్రతిపక్షాల నోళ్లకు తాళాలుపడ్డాయని పేర్కొన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తిచేసి నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి జలాలను జిల్లాకు ముఖ్యమంత్రి తెప్పిస్తున్నారని, మరో రెండేళ్లలో సాగునీరు, తాగునీరుకు కొదవ వుండదని అభివృద్ధికి సహకరించాల్సిన నాయకులంతా ప్రజలను రెచ్చగొట్టి అధికారదాహంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ప్రజల నుంచి వ్యతిరేకతతోపాటు తగిన దండన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన అనుచరగణం తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపనులకు సలహాలు ఇచ్చి అభివృద్దికి సహకరించాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన పేర్కొన్నారు.