కడప

పోలవరంపై చంద్రబాబు రెండునాల్కల ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమలాపురం, జనవరి 7: జాతీయ ప్రాజెక్టు పోలవరంపై సియం చంద్రబాబునాయుడు రెండునాల్కల ధోరణితో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన శనివారం మండల పరిధిలోని మీరాపురం గ్రామంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను వదులుకున్నట్లు చెప్పడం చూస్తుంటే తన చేతగానితనాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకున్నట్టుందని ఎద్దేవా చేసారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగారాష్ట్ర పునర్వ్యస్తికరణ చట్టం లో పొందుపరచబడిందని ఆమేరకే ఆ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమి లేదన్నారు. ఇటీవల ప్రారంభించిన పురుషోత్తమపట్నం ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో పోలవరం ప్రాజెక్టు తనవల్లే వచ్చిందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిధర్శనమన్నారు. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే ప్రాజెక్టుల పనులు చంద్రబాబు చేపడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు 2018కల్లా పూర్తి అయ్యేటట్టు ఉంటే ఇక పురుషోత్తం పట్నం పట్టిసీమ ప్రాజెక్టులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. కడప జిల్లాలో తెలుగుగంగ, గండికోట, మైలవరం ప్రాజెక్టులకు అన్నింటికి కలిపి ప్రభుత్వం 12టియంసిల నీరు మాత్రమే విడుదల చేసిందని ఐతే చంద్రబాబు ఇతర జిల్లాల్లో వంద టియంసిల నీరు ఈ జిల్లాకు కేటాయించినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. పైడిపాలెం రిజర్వాయర్‌కు చెందిన 3 గ్రామాల నిర్వాసితుల కు డబ్బులు చెల్లించకుండానే నీరు వదులుతున్నట్లు అబద్దపు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని బాబు చేపట్టారని హేళన చేసారు. ఇందులో ఆ పార్టీనేతలు ఉత్తమారెడ్డి,రాజశేఖరరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,సుబ్బారెడ్డి,రాజారెడ్డి,ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

తిమ్మాపురం చెరువుకు చేరిన నీరు

కొండాపురం, జనవరి 7: గాలేరునగరి - సృజలశ్రవంతిలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు నుండి కృష్ణాజలాలు గండికోట ఎత్తిపోతల పథకానికి చేరుతున్నాయి. ఈ నేపద్యంలో గండికోట ఎత్తిపోతల పథకం-2 నుంచి తిమ్మాపురం చెరువుకు ట్రయల్న్ నిర్వహించారు. శనివారం సాయంత్రానికి నీరు తిమ్మాపురం చెరువుకు చేరగా మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మార్కెట్‌యార్డు ఛైర్మెన్ వైవి.నారాయణరెడ్డి, తిమ్మాపురం మాజీ సర్పంచ్ బాబుల్‌రెడ్డి కృష్ణాజలాలకు పూజలుచేసి హారతులిచ్చారు. ఈ చెరువు నందు 0.3 టిఎంసీల నీటిని నిల్వచేయు విధంగా నిర్మాణం జరిగింది. దీని వలన రైతాంగానికి ఎంతో ఉపయోగముంటుందని, తాగు, సాగునీటికి ఇబ్బంది వుండదని రామసుబ్బారెడ్డి తెలిపారు. సిఎం చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించడం వల్లే గండికోటకు కృష్ణాజలాలు వస్తున్నాయన్నారు. చెరువుకు నీరు రావడంతో తిమ్మాపురం గ్రామస్తులు సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో చెవిటిపల్లె సర్పంచ్ రామలింగేశ్వరరెడ్డి, న్యాయవాది మురళి ఉన్నారు.

పెద్దనోట్ల రద్దుతో ప్రజల ఇక్కట్లు

కడప,(కల్చరల్)జనవరి 7: కేంద్రప్రభుత్వం అనాలోచితంగా పెద్దనోట్లను రద్దుచేసి సామాన్యప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు పిసిసి ఉపాద్యక్షుడు డా.ఎన్.తులసిరెడ్డి కేంద్రాన్ని విమర్శించారు. శనివారం కడప కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పెద్దనోట్ల రద్దుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన తులసిరెడ్డి జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జి కె.చెంచల్‌బాబు లు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ నల్లధనాన్ని అరికడతానని చెప్పి పేద ప్రజలను ఇబ్బందులపాలు చేశారని విమర్శించారు. క్యూలో నిలుబడలేక అనేక మంది ప్రణాలు వదిలార న్నారు. నోట్లను రద్దుచేసి రెండునెలలైనా పేద ప్రజలు బ్యాంకుల చుట్టుతిరుగుతూ క్యూలో నిలబడి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూలీ,నాలీ చేసుకునే జనాన్ని ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని ప్రశ్నించారు. వ్యాధులు సోకితే చూపించుకునేందుకు డబ్బులు లేక వ్యాధిగ్రస్తులై చనిపోతున్నారన్నారు. ఈ ధర్నాలో డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పిసిసి జనరల్ సెక్రటరీ ఎస్‌ఏ సత్తార్, నీలి శ్రీనివాసులు, కర్నాటి చంద్రశేఖర్‌రెడ్డి, చార్లెస్, వెంకటరమణారెడ్డి, గౌస్‌పీర్, చాన్ అలీ, శివకుమార్‌రెడ్డి, సుజారెడ్డి, గోపాలాదేవి, శాంతయ్య, జిల్లాలోని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.